వ్యవసాయ యంత్రాలకు నిబంధనల వర్గీకరణలో ప్రజాభిప్రాయం సేకరణ

వ్యవసాయ యంత్రాలకు నిబంధనల వర్గీకరణలో ప్రజాభిప్రాయం సేకరణ..

ఈనెల 5వ తేదీన విడుదల చేసిన జీఎస్ఆర్ 491(ఇ) ద్వారా, ‘సీఎంవీఆర్‌-1989’ని సవరించేందుకు ప్రతిపాదించిన ముసాయిదా నోటిఫికేషన్‌పై ప్రజలు, సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలు, సూచనలను ‘కేంద్ర రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ’ కోరింది. ఆ సవరణలు..

(i) వ్యవసాయ యంత్రాలు (వ్యవసాయ ట్రాక్టర్లు, పవర్‌ టిల్లర్లు, కోత యంత్రాలు), నిర్మాణ యంత్రాలతో కూడిన వాహనాలకు విడిగా ఉద్గార నిబంధనలు

(ii) బీఎస్‌-4 (సీఈవీ/టీఈఆర్‌ఎం) నుంచి బీఎస్‌-5 (సీఈవీ/టీఆర్‌ఈఎం)కు మార్చడానికి..

a. వ్యవసాయ ట్రాక్టర్లు ఇతర యంత్రాలకు టీఆర్‌ఈఎం స్టేజ్‌-4, టీఆర్‌ఈఎం స్టేజ్‌-5

b. నిర్మాణ యంత్రాలతో కూడిన వాహనాలకు సీఈవీ స్టేజ్‌-4, సీఈవీ స్టేజ్‌-5

బీఎస్‌ నిబంధనలు వర్తించే ఇతర వాహనాల మధ్య ఉద్గార నిబంధనల్లో గందరగోళాన్ని దూరం చేయడానికి దీనిని తీసుకొచ్చారు.

(iii) ట్రాక్టర్ల తయారీలో తర్వాతి దశ ఉద్గార నిబంధనలను అమలు చేయడానికి మరికొంత సమయం కావాలన్న కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, ట్రాక్టర్ల తయారీ సంస్థలు, వ్యవసాయ సంఘాల విజ్ఞప్తుల మేరకు గడువును పొడిగించారు. ఈ ఏడాది అక్టోబర్‌ 1వ తేదీ నుంచి, వచ్చే ఏడాది అక్టోబర్‌ 1 వరకు ఈ గడువును పెంచారు. నిర్మాణ సామగ్రి వాహనాల విషయంలోనూ, వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి వర్తింపజేయాల్సిన తదుపరి దశ ఉద్గార నిబంధనలకు ఆరు నెలలు వెసులుబాటు కల్పించారు.

సంబంధిత వర్గాలు, ప్రజలు తమ సలహాలు, సూచనలను.. “జాయింట్‌ సెక్రటరీ (ఎంవీఎల్‌), మినిస్ట్రీ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ హైవేస్‌, ట్రాన్స్‌పోర్ట్ భవన్‌, పార్లమెంట్‌ స్ట్రీట్‌, న్యూదిల్లీ-110001” అడ్రస్‌కు పంపాలి. ఈ-మెయిల్‌ ద్వారా పంపాలనుకునే వారు jspb-morth@gov.in కు పంపాలి. నోటిఫికేషన్ తేదీ నుంచి 30 రోజుల్లోగా సలహాలు, సూచనలు పంపాలి.