హైకోర్టులో మద్యం దుకాణాలు తెరవరదాని పిటిషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరవకుండా అదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. హైకోర్టులో అమ్మిశెట్టి శివ అనే వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసారు. లాక్ డౌన్ సమయం ముగిసే వరకు మద్యం అమ్మకాలు జరపకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. మద్యం అమ్మకాల వల్ల సోషల్ డిస్టన్స్ పక్కన పెట్టి, షాపుల వద్ద జనాలు బారులు తీరుతున్నారని పిటిషన్ అంశాలలో తెలిపారు. ధర్మాసనం ఈ పిటీషన్ విచారణకు స్వీకరించింది. రేపు విచారణకు రానుంది.