పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గయోచ్.

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గయోచ్.

వాహనదారులకు తీపికబురు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి.
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పడిపోవడంతో లీటర్ పెట్రోల్ పై రూ.2.69, డీజిల్ పై రూ.2.33 తగ్గాయి. పెట్రోలియం సరఫరా చేసే OPEC vs రష్యా మధ్యలో ఉత్పత్తిపై పోటీ తీవ్రతరం అలాగే ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోండటం గ్లోబల్ మార్కెట్‌లో పెట్రో ధరలు భారీగా పతనమయ్యాయి. ఇదే కాదు మరో 15 రోజులపాటు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని సమాచారం. ఏప్రిల్ 1 నుంచి మాత్రం GS6 నిబంధనల వల్ల మాత్రం ధరలు పెరిగే అవకాశం ఉంది. రంగుల హరివిల్లు హోలీ పూర్తయిన వెంటనే ప్రజలకు సంతోషం కలిగించే వార్తను ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పడిపోవడంతో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.70.29కు చేరింది. పెట్రోల్‌పై రూ.2.69 తగ్గగా.. డీజిల్‌పై రూ.2.33 తగ్గింది. లీటర్ డీజిల్ రూ.63.01కి చేరింది. మంగళవారం (మార్చి 10, 2020) ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.72.98కి విక్రయించగా. డీజిల్ రూ.65.34కి విక్రయించారు.
సోమవారం (మార్చి 9, 2020) పెట్రోల్, డీజిల్ ధరలు రూ.71 మార్క్ చేరాయి. 8 నెలల తర్వాత కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. లీటర్ పెట్రోల్ రూ.70.59కి చేరింది. ఇది 2019 జూలై తర్వాత కనిష్ట ధరకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిస్థితులతో ఫిబ్రవరి 27వ తేదీ నుంచి పెట్రో ఉత్పత్తలు ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.