పాతాళంలో ప్రపంచ చమురు ధరలు

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 17 ఏళ్ల కనిష్ఠానికి
పడిపోయాయి. మరీ మన దేశంలో ఆ ఫలాలు మనకు అందుతున్నయా అంటే NO ఒక్కటే సమాధానం. కేంద్ర రాష్ట్ర సర్కార్ల సుంకాలే కారణం. విశ్వ విపణిలో బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 2002 నాటి ధరలకు ఇంచు మించుగా ఆ స్థాయిలో 23 డాలర్లకు పడిపోయింది. కానీ దేశీయంగా పెట్రో ధరల్లో మాత్రం మార్పు రాలేదు.

ఈ నెల 16న దేశీయ కంపెనీలు చమురు ధరలు చివరిసారి సవరించాయి. ఢిల్లీలో ప్రస్తుతం లీటరు పెట్రోలు 69.59₹ డీజిల్ 62.29₹ ఉంది. ముంబైలో లీటరు పెట్రోలు 75.30₹, డీజిల్‌ 65.21₹ విక్రయిస్తున్నారు. ఈ మధ్యలోనే కేంద్రం పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. ఆయిల్ కంపెనీలు చమురు ధరల తగ్గింపు ప్రయోజనాన్ని ఎక్సైజ్ సుంకానికి సర్దుబాటు చేస్తూ కార్యాచరణ జరగడంతో ధరలు మార్పులు లేకుండా పోయాయి.