మద్యం ప్రియులు వైన్ షాపుల వద్ద భౌతిక దూరం పాటిస్తున్నారు

మద్యం ప్రియులు వైన్ షాపుల వద్ద భౌతిక దూరం పాటిస్తున్నారు. మద్యం దుకాణాల ముందు ఎక్సైజ్ విభాగం అధికారులు ఏర్పాటు చేసిన రింగులలో మాత్రమే కాకుండా ఎవరికి వారు గొడుగులు కూడా వెంట తెంచుకుంటున్నారు. దీనివలన మనిషికి మనిషికి మధ్య గొడుగు పరిమాణం దూరంతో పాటు వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉంటాయని స్థానికులు అంటున్నారు.