సీఎం జగన్ వెనుక శ్రీవేంకటేశ్వరుని చిత్రపటం.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్య

సీఎం జగన్ వెనుక శ్రీవేంకటేశ్వరుని చిత్రపటం.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్య

కరోనా నివారణపై ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన వేళ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ఆసక్తికర చర్చ జరిగింది. బ్రహ్మోత్సవాల నిమిత్తం తిరుమలకు వచ్చిన జగన్, అన్నమయ్య భవన్ నుంచే వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. సీఎం జగన్ సీటు వెనుక శ్రీ వేంకటేశ్వరుని పెద్ద చిత్రపటం ఉంది.దీన్ని గమనించిన మోదీ, తనకు ఈ విధంగా శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం అయినందుకు ఎంతో ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చి కూడా, తనతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడటం అభినందనీయమని జగన్ ను ఉద్దేశించి అన్నారు. ఏపీలో అమలు చేస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థతో ప్రజలకు సత్వర సేవలు అందుతున్నాయని వ్యాఖ్యానించిన ప్రధాని, ఇదే విధానాన్ని మిగతా రాష్ట్రాల్లోనూ అమలు చేస్తే బాగుంటుందని అన్నారు.