ప్లాట్ ఫార్మ్ టికెట్ల ధర పెంచిన రైల్వేశాఖ.

ప్లాట్ ఫార్మ్ టికెట్ల ధర పెంచిన రైల్వేశాఖ.

రైల్వే శాఖ ప్లాట్ ఫార్మ్ టికెట్ల ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రూ.10 ఫ్లాట్‌ఫాం టికెట్‌ ధరను రూ.50కి పెంచారు.
250 రైల్వేస్టేషన్లలో ఫ్లాట్‌ఫాం టికెట్ల ధర పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ధరలు కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రైల్వే ఫ్లాట్‌ఫాంపై రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రైల్వే స్టేషన్లలో కరోనా ప్రభావాన్ని తగించేందుకు ఈ విధమైన చర్యలకు ఉపక్రమించమని రైల్వే శాఖాధికారులంటున్నారు.