కరోనాలో క్రికెట్ ఆడుతూ జనానికి సందేశం

నల్గొండ MLA కంచర్ల భూపాల్ రెడ్డి కరోనా కాలంలో ఆనందంగా ఇంటి పరిసరాల్లోనే ఉండాలని సూచిస్తూ క్రికెట్ ఆడారు. కరోనా మహామ్మారిని తరిమి కొట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ శాసన సభ్యులు ఆటవిడుపుగా క్రికెట్ ఆడుతూ కనువిందు చేసారు. కరోనా కాలంలో నిరాశ చెందకుండా ఆహ్లాదంగా ప్రజలంతా సంతోషంగా కుటుంభ సభ్యులతో గడపాలని కరోనా మహామ్మారి త్వరలో తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేసేందుకు ముఖ్యమంత్రి KCR ప్రయత్నం చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.