CMs కాన్ఫరెన్సులో PM కరోనా రాబోయే నెలల్లో కొనసాగుతుంది?? నెల కాదండోయ్.

దేశంలో కోవిడ్-19ను పరిష్కరించడానికి ముందస్తు ప్రణాళిక కోసం ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి సంప్రదింపులు జరిపారు. సమావేశంలోని ముఖ్యాంశాలు.

1. గడచిన ఒకటిన్నర నెలల్లో లాక్ డౌన్ కారణంగా దేశం వేలాదిమంది ప్రజల ప్రాణాలను కాపాడుకోగలిగింది.

2. వేగవంతమైన స్పందనే మన తప్పనిసరి లక్ష్యం కావాలి, “రెండు గజాల దూరం” మంత్రాన్ని అనుసరించవలసిన అవసరం ఉంది: CM లతో ప్రధానమంత్రి.

3. రెడ్ జోన్లు ఆరంజ్ జోన్లుగా ఆ తర్వాత గ్రీన్ జోన్లుగా మారే దిశగా రాష్ట్రాలు కృషి చేయాలి: ప్రధానమంత్రి.

4. సాధారణ పౌరుల జీవితాల సుఖవంతం కోసం సంస్కరణలు తీసుకురావడానికి మనం ధైర్యంగా ఉండాలి : ప్రధానమంత్రి.

5. కోవిడ్-19 కు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తూనే, ఆర్థికవ్యవస్థకు తగిన ప్రాధాన్యత నివ్వాలి.

6. కరోనా వైరస్ ప్రభావం రానున్న నెలల్లో కూడా కొనసాగుతుంది, మాస్కులు, ఫేస్ కవర్లు మన జీవితంలో భాగంగా ఉంటాయి. ప్రధానమంత్రి మోదీ.

7. ముఖ్యమంత్రులు తమ స్పందన తెలియజేశారు. ఆర్ధిక సవాళ్ళను ఎదుర్కోడానికీ, ఆరోగ్య మౌలిక సదుపాయాలు పెంపొందించుకోడానికీ చర్యలు సూచించారు.