లాక్ డౌన్ నగదు బదిలీ పంపిణీ: కేంద్రం

లాక్ డౌన్ నగదు బదిలీ పంపిణీ: కేంద్రం

కోవిడ్-19 వల్ల విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో ప్రధాన మంత్రి గరిబ్ కళ్యాణ్ యోజన లబ్దిదారులకు నగదు పంపిణీ సజావుగా అయ్యేలా చూడాలని రాష్ట్రాలు/యూటీ లకు హోంమంత్రిత్వ శాఖ లేఖ రాసింది.

21 రోజుల లాక్డౌన్ సమయంలో, ప్రధాన మంత్రి గరిబ్ కళ్యాణ్ యోజన లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా నగదు పంపిణీపై ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక సేవల విభాగం వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేసింది.

ఈ మార్గదర్శకాలను అనుసరించి, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అజయ్ కుమార్ భల్లా అన్ని రాష్ట్రాలు/యుటిలకు లేఖ రాశారు, పిఎమ్-జికెవై లబ్ధిదారులకు డబ్బు సజావుగా పంపిణీ చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో సామాజిక దూరం నిబంధనలను పాటించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ/కేంద్రపాలిత ప్రాంతలలో సంబంధిత శాఖల యంత్రాంగం, జిల్లా అధికారులు, క్షేత్ర స్థాయిలో పనిచేసే సంస్థలకు మార్గదర్శకాలను వివరించి అవి కచ్చితంగా అమలయ్యేలా చూడాలని లేఖలో పేర్కొన్నారు.