మన్కీ బాత్ కోసం ఆలోచనలు పంచుకోవాలని పీఎం ఆహ్వానం

మన్కీ బాత్ కోసం ఆలోచనలు పంచుకోవాలని పీఎం ఆహ్వానం

2021 అక్టోబర్ 24వ తేదీ ఆదివారం నాడు జరుగనున్న ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం 82వ భాగం కోసమని పౌరుల ను వారి వారి ఆలోచనల ను పంచుకోవలసిందంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమానికి గాను పౌరులు వారి ఆలోచనల ను NaMo App (నమో ఏప్), MyGov (మైగవ్) లకు రాసి పంపవచ్చు, లేదా 1800-11-7800 నంబరు కు డయల్ చేస్తే వారి సందేశాన్ని రికార్డు చేయడం జరుగుతుంది.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

ఈ నెల లో #MannKiBaat కార్యక్రమం 24వ తేదీ నాడు జరుగనుంది. ఈ నెల ఎపిసోడ్ కోసం మీ మీ ఆలోచనల ను వెల్లడించవలసిందంటూ మిమ్ములను నేను ఆహ్వానిస్తున్నాను. మీ ఆలోచనల ను NaMo App (నమో ఏప్) కు, లేదా @mygovindia (మైగవ్ఇండియా) కు రాసి పంపవచ్చు, లేదా 1800-11-7800 నంబరు కు డయల్ చేస్తే మీ సందేశాన్ని రికార్డు చేయడం జరుగుతుంది. https://t.co/QjCz2bvaKg’’ అని పేర్కొన్నారు.