కరోనాపై CM జగన్‌కు PM మోదీ ఫోన్‌.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌కు ఫోన్‌ చేశారు. కోవిడ్‌-19 నివారణకోసం తీసుకుంటున్న చర్యలపై ఇరువురు చర్చించుకున్నారు. రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలు, అనుసరిస్తున్న వ్యూహాలపై ప్రధానికి సీఎం వివరించారు. రాష్ట్రంలో వైరస్‌ నివారణకు, వ్యాప్తిని అడ్డుకోవడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని సీఎం వివరించారు. టెస్టింగ్‌ సామర్థ్యాన్ని పెంచుకున్న అంశాన్ని సీఎం ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.