కరోనా వైరస్ నుంచి రక్షణకు బుద్ధం శరణం గచ్చామి. బుద్ధ పూర్ణిమ ప్రసంగంలో PM మోదీ

క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌కు బుద్ధం శ‌ర‌ణం గ‌ఛ్చామి మనకు శిరోధార్యమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అంటున్నారు. బుద్ధ నీతి ద్వారా క‌ర‌నో వైర‌స్‌కు వ్య‌తిరేకంగా యుద్ధ నీతిని బోధించారు. ఇవాళ బుద్ధ పూర్ణిమ‌ను పుర‌స్క‌రించుకుని దేశ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతూ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ జాతినుద్ధేశించి సందేశమిచ్చారు.

బుద్ధుడు దేశ సంస్కృతి, సంప్ర‌దాయాన్ని స‌మృద్ధి చేశారు. బుద్ధుడు వెలుగుతూ ఇత‌రుల‌కు వెలుగునిచ్చారు. బుద్ధుడి సందేశం జీవితంలో నిరంత‌రం ప్ర‌వ‌హిస్తూనే ఉంటుంది. బుద్ధుడు కేవ‌లం పేరు కాదు, ఓ ప‌విత్రమైన సిద్ధాంతం. బుద్ధిని ప్రవచనాలు ప్ర‌తి ఒక్క‌రికి మార్గ‌ద‌ర్శ‌నం చేస్తుంది. త్యాగం, త‌పస్సు, సేవా, త్యాగానికి ప‌ర్యాయ‌ప‌దం. పేద‌ల‌కు భోజనం క‌ల్పించ‌డం, 24 గంట‌ల పాటు సేవ‌లు అందిస్తున్న వైద్య సేవ‌లు అందించ‌డం, శాంతిభ‌ద్ర‌త‌లు కాపాడేవారు అభినంద‌నీయులు.

ప్ర‌పంచం అత‌లాకుత‌లం అవుతున్న స‌మ‌యంలో బుద్దుడు మాన‌వుడు సిద్ధాంతాలు మనం పాటిస్తూ నిరంత‌రం విజయం వైపు ప్ర‌య‌త్నించాలి. కరోనా లాంటి క‌ఠిన ప‌రిస్థితుల్లో విజ‌యం సాధించాలి. అల‌సి ఆగిపోవ‌డం ప్ర‌త్యామ్న‌యం కాదు. ఇవాళ మ‌నం అంద‌రం క‌ఠిన ప‌రిస్థితుల నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికి నిరంత‌రం కృషి చేస్తున్నాం. క‌లిసి ప‌నిచేస్తున్నాం.

అలాగే బుద్ధుడు చెప్పిన నాలుగు స‌త్యాలు, ద‌య‌, క‌ర‌ణ‌, క‌ష్ట‌సుఖాల్లో భాగం పంచుకోవ‌డం, య‌ధాస్థితిని స్వీక‌రించ‌డం ఈ స‌త్యం భార‌త భూమికి ప్రేర‌ణ‌గా నిలిచింది. భార‌త్ నిస్వార్ధ‌ భావ‌నతో దేశంలో, విశ్వంలో క‌ష్టాల్లో ఉన్న దేశాల వెనుక నిలబడింది. లాభ‌నష్టాలు చూసుకోకుండా క‌ష్ట‌కాలంలో స‌హాయం చేస్తోంది. క‌ష్ట‌కాలంలో భార‌తదేశంను ప్రపంచ దేశాలు గుర్తు చేసుకున్నాయి. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితిలో ప్ర‌పంచ దేశాల‌కు స‌హాయం చేయ‌డంలో మన దేశం ఎక్క‌డా వెనుకంజ‌వేయ‌డం లేదు.

బుద్ధుడి ఉప‌దేశాలు మాన‌వ సేవ‌లో అంకిత‌ భావానికి క‌ట్టుబ‌డి ఉన్నాయి. ఆత్మ‌బోధానుసారం భార‌త్ నిరంత‌రం విశ్వ‌హితం కోసం ప‌నిచేస్తోంది, ప‌నిచేస్తూనే ఉంటుంది. భార‌త్ ప్ర‌గ‌తి ప్ర‌పంచ ప్ర‌గ‌తిలో స‌హాయ‌కంగా ఉంటుంది. మ‌నం చేసే ప‌ని నిరంత‌రం సేవాభావంతో ఉండాలి. ఎలాంటి ఎంత‌టి పెద్ద స‌వాళ్ళైన అధిగమించ‌వ‌చ్చు. నిరంత‌రం ప్ర‌జాసేవ‌లో నిలిచేవారు నిజ‌మైన బుద్ధుల అనుయాయులుగా అవుతారు. ఇత‌రుల‌కు స‌హాయం చేయాలని ప్రధానమంత్రి ప్రసంగాన్ని ముగించారు.