RBI నిర్ణయం మంచిదన్న మోదీ

భారతీయ రిజర్వ్ బ్యాంకు ఈరోజు చేసిన ప్రకటనలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసించారు. ఈ చర్యల వల్ల లిక్విడిటీ పెరుగుతుందనీ, క్రిడిట్ సరఫరా మెరుగౌతుందనీ ఆయన అన్నారు.

ఈ మేరకు ప్రధానమంత్రి ఒక ట్వీట్ చేస్తూ, ” ఈ రోజు ఆర్.బి.ఐ. చేసిన ప్రకటనలు లిక్విడిటీని పెంచుతాయి మరియు క్రెడిట్ సరఫరాను మౌరుగుపరుస్తాయి. ఈ చర్యల వల్ల చిన్న వ్యాపారాలు, ఎం.ఎస్.ఎం.ఈ.లు; రైతులు, పేద ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. డబ్ల్యూ. ఎమ్.ఏ. పరిమితులు పెంచడం వల్ల అన్ని రాష్ట్రాలు కూడా లాభపడతాయి.” అని పేర్కొన్నారు.