మోడీ తెచ్చిన జనతా కర్ఫ్యూ

కరోనా కట్టడిపై జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగం.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జనతా స్వచ్ఛందంగా
మార్చి 22న ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు
కరోనాపై కర్ఫ్యూలా ఇంట్లోనే ఉండాలని పిలుపునిచ్చారు.
కరోనా వైరస్‌ విజృంభిస్తోండటంతో జనం కోసం జనమే
కర్ఫ్యూ విధించుకోవాలని జాతినుద్దేశించి నరేంద్రమోడీ ప్రసంగించారు. మొదటి ప్రపంచ యుద్ధాల కంటే పెద్ద
విపత్తులా కరోనా సంక్షోభం ప్రపంచ ఎదుర్కొంటోందని
అందుకే భారతీయులు ఈ మహమ్మారిపై అందరూ స్వీయ నియంత్రణ, జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శాస్త్రవేత్తలు ఇప్పటికి టీకాలు తయారు చేయలేదు. దృఢ సంకల్పంతో
ఐక్యమత్యంతో కలిసి కరోనా కట్టడిపై కృషి చేయాలన్నారు.
దేశ ప్రజలందరూ అవసరం లేకుండా ఇంట్లోంచి బయటకు రాకూడదని జన సమూహాల్లో తిరగరాదన్నారు.

నిత్యావసరాలకు కొరత రానివ్వకుండా ప్రభుత్వం చూస్తోంది కానీ వ్యాపారాలు, ఉద్యోగాలు ఇంట్లోంచే పనులు చేయాలి. 60-65 ఏళ్ల వృద్ధులు, 10 ఏళ్ల లోపు చిన్నారులు బయటకు వెళ్లారాదు. కేంద్రంతో పాటు రాష్ట్రాలు, స్థానిక సంస్థలు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు సైరన్‌ మోగించాలి.
దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా కరోనా ప్రభావం ఉండబోతోందని అందుకే ఆర్థిక అంచనా వేసేందుకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయబోతున్నామన్నారు.