ఇండోనేషియా అధ్యక్షునితో PM మోదీ టెలిఫోన్ కాల్

ఇండోనేశియాకు ఔషధ ఉత్పత్తుల ను సరఫరా చేయడం ద్వారా భారత ప్రభుత్వం సౌలభ్యం కల్పించడాన్ని ఇండోనేశియా అధ్యక్షుడు ప్రశంసించారు. ఔషధీయ సామగ్రి సరఫరాలో గాని లేదా ఇరు దేశాల మధ్య వ్యాపారం జరిగే ఇతర వస్తువుల సరఫరాల లో గాని ఎటువంటి అంతరాయం తలెత్తకుండా నివారించడంలో భారతదేశం శాయశక్తుల సాయపడుతుందంటూ ఆయన కు ప్ర‌ధాన‌ మంత్రి హామీ ని ఇచ్చారు.

నేత లు ఇరువురూ తమ తమ దేశాల లోని పౌరుల కు సంబంధించిన అంశాల ను గురించి చర్చించి, ఈ విషయం లో సాధ్యమైనంత వరకు సదుపాయ సంధానానికై వారి వారి బృందాలు పరస్పరం సంప్రదింపులు జరుపుకొంటూ ఉండాలి అని వారు సమ్మతించారు.

భారతదేశంతో సముద్ర ప్రాంతం పరం గా విస్తారిత పొరుగు దేశం గా ఇండోనేశియా ఉంటూ భారత్ కు సముద్ర సంబంధిత ముఖ్య భాగస్వామ్య దేశాల లో ఒకటి గా ఉందన్న వాస్తవాన్ని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. అంతే కాక, ద్వైపాక్షిక సంబంధాల యొక్క బలం ప్రపంచవ్యాప్త వ్యాధి ‘కోవిడ్-19’ యొక్క ప్రభావాల ను ఎదుర్కొని పోరాడడం లో ఉభయ దేశాలకు సహాయకారి కాగలదని కూడా ఆయన అన్నారు.

స్నేహశీలురైన అటువంటి ఇండోనేశియా ప్రజలకు మరియు అధ్యక్షుడు మాన్య విడోడోకు పవిత్ర మాసం ‘రంజాన్’ ను పురస్కరించుకొని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలను వ్యక్తం చేశారు.