SAARC దేశాలతో కరోనాపై వీడియో కాన్ఫరెన్స్: PM మోడీ

SAARC దేశాలతో కరోనాపై వీడియో కాన్ఫరెన్స్: PM మోడీ

కరోనా వైరస్ ప్రబలకుండా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై SAARC దక్షిణాసియా దేశాలు నేతల “వీడియో కాన్ఫరెన్స్ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆరంభిచారు.
భారత దేశంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్న తీరును, తీసుకున్న నిర్ణయాలను ఈ సందర్భంగా SAARC దేశాలకు వివరించిన ప్రధాని నరేంద్ర మోడి.

SAARC దేశాలు COVID-19 అత్యవసర నిధిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాము. ఆసియా దేశాలు స్వచ్ఛందంగా
నిధులు కేటాయించాలి. భారతదేశం 10 మిలియన్ యూఎస్ డాలర్ల కేటాయిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు.

సార్క్ దేశాధినేతలు కొవిడ్‌-19పై వీడియో కాన్ఫ‌రెన్స్‌
భారతదేశ ప్ర‌ధాన మంత్రి వ్యాఖ్యలు

స్వ‌ల్ప‌వ్య‌వ‌ధిలో మీరంతా ఈ ప్ర‌త్యేక సంభాష‌ణ‌లో
పాలు పంచుకుంటున్నందుకు అంత‌రికీ కృత‌జ్ఞ‌త‌లు.
ఇటీవలి శస్త్రచికిత్స తర్వాత మ‌న‌తో క‌ల‌సిన‌, మిత్రుడు ప్రధాని ఒలికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. అధ్యక్షుడు అష్రఫ్ ఘని ఇటీవల తిరిగి ఎన్నికైనందుకు నేను వారిని అభినందిస్తున్నాను. సార్క్ కొత్త సెక్ర‌ట‌కీ జ‌న‌ర‌ల్‌కు స్వాగ‌తం ప‌లుకుతున్నాను. వారు కూడా ప్ర‌స్తుతం మ‌న‌తో ఉన్నారు. గాంధీన‌గ‌ర్ నుంచి సార్క్ విప‌త్తు నిర్వ‌హ‌ణ సెంట‌ర్ డైర‌క్ట‌ర్ కూడా మ‌న‌తో ఉన్నారు.

ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ WHO కోవిడ్ -19 వైరస్ తీవ్రమైనదిగా
ప్ర‌క‌టించిన విషయం మ‌నంద‌రికీ తెలుసు. SAARC దేశాల్లో 150 కేసులు న‌మోద‌య్యాయి. అందుకే మ‌నం మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాలి. మాన‌వాళిలో ఐదోవంతు మ‌న ప్రాంతంలోనే నివ‌శిస్తోంది. జ‌న‌సాంద్ర‌త ఎక్కువ‌గ‌ల ప్రాంతం మ‌న‌ది. ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల అందుబాటు విషయంలో, అభివృద్ధి చెందుతున్న దేశాలుగా, మన ముందు గణనీయమైన సవాళ్లు ఉన్నాయి. మ‌న ప్రజలందరి మ‌ధ్య సంబంధాలు శతాబ్దాల పురాతనమైనవి, అంతేకాదు, మ‌న స‌మాజాలు లోతైన అనుసంధాన‌త క‌లిగి ఉన్నాయి.
అందువల్ల, మనమందరం కలిసి సంసిద్ధంగా ఉండాలి, మనమందరం కలిసి పనిచేయాలి, మనమందరం కలిసి ఐక్యమత్యంతో విజయం సాధించాలి.

మ‌నం కరోనా స‌వాలును ఎదుర్కోవ‌డానికి సంసిద్ధంగా ఉన్నాం. ఇప్ప‌టివ‌ర‌కూ ఈ వైర‌స్ వ్యాప్తిని ఎదుర్కోవ‌డంలో భార‌త్ అనుభ‌వాన్ని మీకు వివ‌రిస్తాను. అందరూ అప్ర‌మ‌త్తంగాఉండండి, కానీ ఆందోళ‌న చెంద‌వ‌ద్దు” అన్న‌ది మాకు మార్గ‌ నిర్దేశంగా నిలుస్తున్న మంత్రం. ఆలోచ‌నతో ముందేకెళ్లాలి హ‌డావుడి కాకుండా, స‌మ‌స్య‌ను త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌కుండా మేం అప్ర‌మ‌త్తంగా ఉన్నాం. భారత దేశంలో గ్రేడెడ్ రెస్పాన్స్ మెకానిజంతో సానుకూల చ‌ర్య‌లు తీసుకునేందుకు ప్ర‌య‌త్నించాం. జ‌న‌వ‌రి నెల మ‌ధ్య‌ నుంచే భార‌త‌దేశంలోకి వ‌చ్చే వారిని ప‌రిశీలించ‌డం మొద‌లుపెట్టాం. ఆ త‌ర్వాత క్ర‌మంగా ప్ర‌యాణాల‌పై ఆంక్ష‌లు పెంచుతూ వ‌చ్చాము. ఇలా అంచెలంచెలుగా తీసుకుంటూ వ‌చ్చిన చ‌ర్య‌లు ప్ర‌జ‌లు ఆందోళ‌న చెంద‌కుండా చూశాయి.
టెలివిజ‌న్‌, ప్రింట్ మీడియా, సోష‌ల్ మీడియాలో ప్ర‌జ‌ల‌కు అవగాహ‌న క‌ల్పించే కార్య‌క్ర‌మాలు చేపట్టాము. ఇబ్బందుల్లోన్న స‌హాయం అవ‌స‌ర‌మున్న వ‌ర్గాల‌ను చేర‌డానికి మేం ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టాం. దేశ‌వ్యాప్తంగా మా వైద్య‌సిబ్బందికి శిక్ష‌ణ‌నివ్వ‌డంతో పాటు మా వ్య‌వ‌స్థల సామ‌ర్ధ్యాన్ని త్వ‌ర‌గా పెంచ‌డానికి కృషిచేశాం. వైద్య ప‌రీక్ష‌ల సామ‌ర్ధ్యాల్ని కూడా పెంచాము. రెండు నెలల్లోనే భారత్ దేశీయంగా ఉన్న ఓ
ప్ర‌ధాన ప‌రీక్షా కేంద్రం నుంచి ఇలాంటివి 60కి పైగా ఏర్పాటు చేసుకోన్నాము. ఈ మ‌హ‌మ్మారిని ప్ర‌తి ద‌శలో అదుపుచేసేందుకు అవ‌స‌ర‌మైన ప్రొటోకాల్స్‌ను మేం అభివృద్ధి చేసుకున్నాం. దేశంలోకి ప్ర‌వేశించే ఎంట్రీ పాయింట్ల‌లో స్క్రీనింగ్‌, అనుమానిత కరోనా వ్యక్తులతో స‌న్నిహితంగా మెలిగిన వారిని గుర్తించ‌డం, క్వారంటైన్‌, అనుమానిత కేసుల‌ను ఏకాంత ప్ర‌దేశంలో ఉంచడం, వైర‌స్ బారినుంచి బ‌య‌ట‌ప‌డిన కేసుల‌ను డిశ్చార్జి చేయ‌డం వంటివి ఇందులో ఉన్నాయి. విదేశాల‌లోని మా ప్ర‌జ‌ల అభ్య‌ర్థ‌న‌ల‌కూ మేం స్పందిస్తున్నాం. మేం వివిధ దేశాల‌లోన్న దాదాపు 1400మంది భార‌తీయుల‌ను వెనక్కు తీసుకు రాగలిగాము. అలాగే మీ మీదేశాల‌కు చెందిన కొంద‌రు పౌరులకు కూడా ‘నైబ‌ర్‌హుడ్ ఫ‌స్ట్ పాల‌సీ ‘కింద స‌హాయం చేస్తున్నాము. విదేశాల‌లోని మా మొబైల్ బృందాలు వారికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డంతోపాటు, ఇలా విదేశాల‌నుంచి ఖాళీచేయించడానికి సంబంధించి కూడా మేం ప్రొటోకాల్స్ రూపొందించాం. ఇండియాలోని ఇత‌ర దేశాల పౌరుల గురించి ఆయా దేశాలు ఆందోళ‌న చెందుతుంటాయ‌న్న విష‌యం కూడా మాకు తెలుసు. అందువ‌ల్ల భారతదేశంలో తీసుకుంటున్న రక్షణ చ‌ర్య‌ల గురించి విదేశీ రాయ‌బారుల‌కు వివారిస్తున్నాము. ప‌రిస్థితులు ఎలా మారుతాయో ఇంకా ఏమీ తెలియ‌ని ప‌రిస్థితుల‌లో ఉన్న విష‌యాన్ని మేం గుర్తించాం.
మీరు కూడా ఇలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొంటూ ఉండ‌వ‌చ్చు.
అందువ‌ల్ల మ‌నం మ‌న ఆలోచ‌న‌ల‌ను పంచుకోవ‌డం ఎంతైనా విలువైన‌వి కాగ‌ల‌వు. ఈ విష‌యంలో మీ అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఎదురుచూస్తున్నాను. ధ‌న్య‌వాదాలు