ప్రధాని అఖిలపక్షం ఏజెండా లాక్ డౌన్.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశంలో కరోనా వైరస్ విజృంభన, లాక్ డౌన్ అమలు చేస్తోన్న అంశాలపై అఖిలపక్ష పార్టీలతో తొలిసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోక్ సభ, రాజ్యసభలలో కనీసం 5 మంది ఎంపీలున్న పార్టీల నాయకులతో PM మోడీ సమావేశమయ్యారు.

ప్రతిపక్షాల వీడియో కాన్ఫరెన్స్ లోని ముఖ్యాంశాలు:

1. PM మోడీ ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్ ఏప్రిల్ 14 తో ముగియనుంది. లాక్ డౌన్ కొనసాగించాలన్న రాష్ట్రాల అభ్యర్థనలను కేంద్రం పరిశీలిస్తోందని రాజకీయ పార్టీలు అభిప్రాయబడ్డాయి.
2. దేశంలో కేసుల నమోదు సంఖ్య పెరగడంతో కరోనా వైరస్ పోరాటంపై చర్చించడానికి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
3. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ అలాగే కాంగ్రెస్ గులాం నబీ ఆజాద్, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు సుదీప్ బండియోపాధ్యాయ, శివసేన నాయకుడు సంజయ్ రౌత్, సమాజ్ వాదీ పార్టీ రామ్ గోపాల్ యాదవ్, బిఎస్పి నాయకుడు ఎస్సీ మిశ్రా, లోక్ జనశక్తి పార్టీ చిరాగ్ పాస్వాన్, ఎన్‌సిపి చీఫ్ శరద్ పవార్, డిఎంకె నాయకుడు టిఆర్ బాలు, TRS కేశవరావు, YSR కాంగ్రెస్ విజయసాయి రెడ్డి తదితరులు కాన్ఫరెన్స్ లోన్నారు.


4. ప్రధాని ఇప్పటికే కాంగ్రెస్ సోనియా గాంధీ, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలతో సహా ప్రతిపక్ష నాయకులను సంప్రదించారు. దేశంలో కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందడాన్ని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సలహాలను కోరారు.
5. మాజీ అధ్యక్షులు ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, HD దేవేగౌడలతో ఆయన మాట్లాడారు.
6. కొరోనా వైరస్‌తో సంబంధం ఉన్న భారతదేశంలో 149 మరణాలు నమోదయ్యాయి, గత 24 గంటల్లో 35 మంది ఉన్నారు – ఇది ఇప్పటివరకు అతిపెద్దగా నమోదైన సంఖ్య.
7. మార్చి 24 న ప్రధాని మోడీ ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్ ఏప్రిల్ 14తో ముగియనుంది, అయితే చాలా రాష్ట్రాలు పొడిగింపును కోరాయి., COVID-19 కేసుల్లో పెరుగుదల మరియు రాబోయే వారాల్లో ఇన్‌ఫెక్షన్ పెరిగే అవకాశం ఉందని హెచ్చరికల అభిప్రాయాలు వచ్చాయి.

8. ఈ నెల 14 తర్వాత లాక్‌డౌన్ ఎత్తేస్తారా? లేదా పొడగింపు ఉంటుందా? అనే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు.

9. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం లాక్‌‌డౌన్ ఉండాలని సూచిస్తున్నప్పటికీ ప్రధాని మోదీ మాత్రం దీనిపై ప్రధాని ఏమి నిర్ణయం తెలుపలేదు.


10. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం శనివారం ప్రధాని మోదీ లాక్‌డౌన్ అంశంపై తుది నిర్ణయం తీసుకోనునే అవకాశాలు ఉన్నాయని తెలిసింది.
11. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ శనివారం రెండోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
12. CMs కాన్ఫెరెన్స్ తర్వాతే లాక్ డౌన్ అంశంపై తుది నిర్ణయం తీసుకుంటారని ఉన్నతాధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
13. రాష్ట్రాల్లో ఉన్న క్షేత్ర స్థాయి పరిస్థితులు, కరోనా వైరస్ సంఖ్య తదితర ముఖ్య విషయాలు PM నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు.
14. రాష్ట్రాల్లోని క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకున్న తర్వాతే ప్రధాని తుది నిర్ణయం తీసుకోనున్నారు.
15. నిరుద్యోగం, ఆర్థిక రంగం కుదేలవుతోందని అందరూ అభిప్రాయబడ్డారు.
16. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన GoM సమావేశంలో మాత్రం కేంద్ర మంత్రులు కొన్ని కీలక సూచనలు చేసారు.
17. పంటల కోతకు అనుమతించడంతో పాటు నిత్యావసర వస్తువుల దుకాణాలకు అనుమతిస్తే ఎలా ఉంటుందని సమాలోచనలు జరిగాయి.
18.ఫుడ్‌కోర్టులు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, మాల్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవొద్దని అభిప్రాయపడ్డారు.
19.రైళ్లు, బస్సులు, మెట్రో సేవలను కూడా మరి కొన్ని రోజుల పాటు మూసే ఉంచాలని సూచించారు.
20. విమాన ప్రయాణాలను మాత్రం దశల వారీగా ప్రారంభిస్తే బాగుంటుందని అభిప్రాయం తెలియజేశారు.

ఈ పరిస్థితుల్లో శనివారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించబోయే వీడియో కాన్ఫరెన్స్ తర్వాత కేంద్రం లాక్ డౌన్ అంశంపై తుది నిర్ణయం తీసుకుంటారని ఉన్నతాధికారుల సమాచారం.