మోడీ మార్క్ కరోనాపై కేబినెట్ ప్రచారం…

కోవిడ్-19 కట్టడిపై కేంద్రం మంత్రివర్గం భేటీ.

ఏదైనా ఎవరైనా చెప్పింది వినాలంటే ముందుగా మనం ఆచరించాలి ఆ తర్వాతే పక్క వ్యక్తులకు అర్థమయ్యేలా అవగాహన కల్పించాలనే సిద్ధాంతంతో ప్రధాన మంత్రి కరోనా కట్టడికి కేంద్ర మంత్రి వర్గ సమావేశం.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన దేశంలో కోవిడ్19 అరికట్టడంపై కేంద్ర మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ మంత్రి వర్గంలో సభ్యులు అందరూ సామాజిక దూరం పాటించాలనే సందేశం ఇవ్వడానికి ఒక్కో కూర్చికి మూడు అడుగుల దూరం ఉంచడం జరిగింది. కేంద్రం మంత్రులు అందరితో దేశ ప్రజలకు నిత్యావసరాలు, అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం, ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న నిర్ణయంపై చర్చలు జరిపారు.