కరోనా వర్ణమాలతో వండివార్చిన కవిత్వం

అ క్కడెక్కడో పుట్టింది
ఆ పదలో ప్రపంచాన్ని పడేసింది
ఇ టలీకి, USA, UKకు వెళ్ళింది
ఈ జిప్టు, స్పెయిన్, ఆఫ్రికాకు పాకింది
ఉ ధృతంగా దేశాలన్నింటిలో పెరిగింది
ఊ చకోతతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది
ఋ క్కులకే అసలు లొంగనంటోంది
ఎ ప్పుడు ఎవరికి, ఎలా వస్తానో చెప్పనంది
ఏ డిపించుకు చిన్నా పెద్దలను తింటోంది
ఐ శ్వర్యానికి, అదృష్టానికి లొంగనంటోంది
ఒ క్కో దేశానికి అంటుకుంటూ హదలెత్తిస్తోంది
ఓ డలు, బస్సులు, రైళ్లు, విమానాలను ఆపేయించింది
ఔ షధాలే లేని మహామ్మారిగా రికార్డుల్లోకెక్కింది.
అం దరికీ వయస్సు తారతమ్యం లేకుండా వ్యాపిస్తోంది
అః కఃనః అన్నట్లు తికమకగా అర్థం కానట్టు ఉంది
క రోనా, కోవిడ్-19, కొరివి దెయ్యం తన పేరంది
ఖ నిత్రంలా దిగుతోంది (ఖనిత్రం అంటే గునపం’ పలుగు)
గ రిష్ఠంగా ఖండాలు అన్నింటిలో పెరుగుతూ పోతోంది
ఘ నుడు, అమాయకుడు, సామాన్యుడని చూడనంది
ఙ వలే తెలియనంది.
చ టుక్కున మనిషికే కాదు మూగ జీవాలకు వస్తోంది
ఛ రఖాలా గిరగిర విశ్వమంత కలియ తిరుగుతోంది
జ బ్బుల్లో నేనే ప్రత్యేకమంటూ కరోనా పెద్దదయింది
ఝం డా అక్కడ ఇక్కడ కాదు అంతటా ఎగరేస్తోంది
ఞ! ఆ! యా! అని వెక్కిరిస్తోంది
ట క్కుడెక్కులు, వగలన్నీ చూపిస్తోంది
ఠ క్కున అందరికి అంటుకుంటుంది
డ బ్బులకు లోంగే జబ్బు కానంటోంది
ఢ మరుకం మూల్లోకాలు వినబడేలా మోగిస్తోంది
ణ లా బుద్ది వంకటింకర, జిగ్ జాగ్ లాగే ఉంటోంది
త నను ఢీ కొట్టే, ఎదురు వచ్చే వారే లేరంటోంది
ద య్యంలా పట్టి అందర్ని పీడిస్తోంది
ధ ర్మం న్యాయం మంచి చెడు తనకు తెలవదంటోంది
న లుగురు కలిస్తే ఓర్వలేక పోతోంది
ప రుగులు, ఉరుకులు, చెమటలు పెట్టిస్తోంది
ఫ లితం ఏమి చేసినా ఉండబోదంటోంది
బ డులు గుడులు షాపులు సినిమాలు మూయించింది
భ యాన్ని ఇంకా రోజురోజుకు పెంచుతోంది
మ రణమృదంగం గల్లీ నుంచి ఢిల్లీ వరకు మోగిస్తోంది
య ముని దగ్గరకు బయటకొస్తే పంపిస్తోంది
ర క్కసిలా దొరికిన మనుషులు అందర్ని తినేస్తోంది
ల క్షల్లో మందిని కబలిస్తోంది
వ రదలా, ఉప్పెనలా ముంచేస్తోంది
శ నిలా మనకు దాపురించింది
ష ట్కాలాల్లో కూడా తానుంటానంది
స బ్బునురగంటే భయమంటుంది
హ రించుటే తన గుణమంది
ళ ఇలా అంటూ అంటుకుంటోంది
(‘ళ’ను అల అని చదువుతుంటారు)
క్ష మించడం తన డిక్షనరీలో లేదంది
ఱంపములా మన హృదయాలను కోసేస్తోంది.