MEIL మిషన్ పోలవరం

MEIL మిషన్ పోలవరం
పోలవరంకు ‘మేఘా’ ఓ వరం.

యుద్ధప్రాతిపదికన పోలవరం ప్రాజెక్టును 2021 జూన్
నాటికి పూర్తి చేయాలని వైఎస్ జగన్మోహన్ ప్రభుత్వం
లక్యంగా పెట్టుకుంది. ఆ దిశగా పోలవరం నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. సకాలంలో పనులు పూర్తి చేయడం లక్ష్యంగా ప్రాజెక్టు నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (మేఘా) కృషి చేస్తోంది.

కాంగ్రెస్, టీడీపీ హయాంలో నత్త నడక…:
దశాబ్దాల పాటు కాంగ్రెస్, టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగాయి. రైతు బాందవుడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి డ్రీమ్ ప్రాజెక్టు అయిన పోలవరం సాగు, తాగునీటి పథకానికి సంబంధించి కీలక అనుమతులన్నీ సాధించిపెట్టారు. వైఎస్సార్ మరణానంతరం కాంగ్రెస్,
టీడీపీ ప్రభుత్వాలకు పోలవరం కాసులు పండించే ప్రాజెక్టుగా మారింది. స్వార్ధ రాజకీయాలు, సొంత ప్రయోజనాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వడంతో ప్రాజెక్టు నిర్మాణ పనులు నత్తనడకన సాగాయి. గత ప్రభుత్వాలు అశాస్త్రీయ విధానంలో ప్రాజెక్టు నిర్మాణం పనులు చేయడంతో ‘ఓ అడుగు ముందుకు పదడుగులు వెనక్కిబడ్డాయి.

మేఘా లక్ష్యం :
దివంగత నేత వైఎస్సార్ డ్రీమ్ ప్రాజెక్టు పోలవరంను అత్యద్భుతంగా ఇంజనీరింగ్ చరిత్రలో నిలిచిపోయే ప్రాజెక్టుగా నిర్మించాలని లక్యం పెట్టుకున్నారూ. అందుకే వైఎస్సార్
తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు తొలి అడుగులో భాగంగా రివర్స్ టెండర్లు పిలిచి మేఘా ఇంజనీరింగ్ సంస్థకు నిర్మాణ పనులు కేటాయించారు. దీంతో ఒక్క క్షణం ఆలశ్యం చేయకుండా మేఘా ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టు పనులు వేగం పుంజుకున్నాయి. అంతేకాకుండా
ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అనుమతులు త్వరితగతిన సాధిస్తుండటంతో
నిర్మాణ పనుల్లో రికార్డు స్థాయిలో పురోగతి కనిపిస్తోంది.
నిర్ధేశిత సమయంలో పనులు పూర్తి చేయడం లక్ష్యంగా
మేఘా ఇంజనీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (MEIL) అహర్నిశలు కృషి చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలు, నిర్లక్ష్యం అంతేకాకుండా అశాస్త్రీయ పద్ధతిలో చేపట్టిన పనులన్నింటినీ క్రమంగా సవరిస్తూ అత్యాధునిక ఇంజనీరింగ్‌ మోడల్‌లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు
బులెట్ రైళ్ల దూసుకుపోతున్నాయి.

మేఘా ఛాలెంజ్:
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఛాలెంజ్ గా స్వీకరించిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ తన శక్తిసామర్ధ్యాలు అన్నింటిని
ఈ ప్రాజెక్టులో కేంద్రీకరించింది. నిర్ణీత గడువుకంటే ప్రాజెక్టులను నిర్మించడంలో ప్రత్యేక గుర్తింపున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ పోలవరం నిర్మాణం గడువులోపే పూర్తిచేసి మరోసారి సత్తాను చాటేందుకు రంగంలోకి దూకింది. అంతే వేగంతో ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో అవసరానికి అనుగుణంగా సరైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు మేఘా సంస్థకు అన్ని విధాల సహకారాన్ని అందిస్తోంది. దీంతో తక్కువ వ్యవధిలోనే ప్రాజెక్టులోని స్పిల్‌వేకు సంబంధించి 62818 ఘనపు మీటర్ల పనిని పూర్తి చేసింది. ముఖ్యమైన పనులను వేగవంతం చేయడానికి గోదావరి నది ఒడ్డున మట్టి పటిష్టతకు సంబంధించి పటుత్వ పరీక్షలతో పాటు గ్యాప్‌-1లో నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక పనులు పనులు చేపట్టింది. జలవిద్యుత్‌ కేంద్రం నిర్మాణానికి సంబంధించిన కొండ తవ్వకంతో (బ్లాస్టింగ్‌) పాటు వరద ఉధృతి వల్ల ప్రాజెక్టు పనులకు అవరోధం కలగకుండా ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్ నిర్మాణ పనులు ముమ్మరం చేసింది.

ప్రపంచ స్థాయి శాస్త్రీయ పద్ధతుల్లో పోలవరం నిర్మాణం.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో డిజైన్లు కీలకమైనవి. డిజైన్లకు అనుమతి లభిస్తే పనులు ఊపందుకుంటాయి. దశాబ్దాలుగా కాంగ్రెస్, టీడీపీ హయాంలో 45 డిజైన్లు అనుమతి లభించాల్సి ఉండగా కొన్నింటికి మాత్రమే అనుమతి లభించింది. అందుకే వైఎస్సార్ సర్కారు పోలవరం ప్రాజెక్టులో కీలకమైన మరో ఎనిమిది డిజైన్ల అనుమతుల కోసం హైదరాబాద్,
దేశ రాజధాని ఢిల్లీలో ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమించింది. దీంతో పనులు ప్రపంచ స్థాయి
శాస్త్రీయ పద్ధతిలో ఊపందుకున్నాయి.

చంద్రబాబు హయాంలో అడ్డగోలు నిర్మాణాలు :
చంద్రబాబు పాలనలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పనులు ఇష్టారాజ్యంగా జరిగాయి. అశాస్త్రీయంగా చేపట్టిన పనులతో ముంపు సమస్య తలెత్తింది. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేశామని జబ్బలు చరిచేందుకు అడ్డగోలుగా పనులు చేయడంతో అసలు పనులకే ఎసరు వచ్చింది. కాఫర్ డ్యాం నిర్మాణంతో గోదావరి నీటిని నిల్వపెట్టి ప్రాజెక్టు పూర్తి చేశామని గొప్పలు చెప్పేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రయత్నం ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర జాప్యానికి ఓ ప్రధాన కారణం. గతంలో ఎన్డీఏలో భాగస్వామైన టిడిపి ఒత్తిడికి తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం 42.5 మీటర్ల ఎత్తులో కాఫర్‌ డ్యామ్ నిర్మించేందుకు అంగీకరించడం మరింత నష్టం కలిగించింది. గత ప్రభుత్వం అ శాస్త్రీయ విధానంతో చేపట్టిన పనుల కారణంగా దాదాపు మూడు నెలల పాటు నిర్మాణం పనుల్లో జాప్యంతో ప్రస్తుతం విలువైన సమయం వృధా అయింది.

2020లోనే నిర్మాణంలో బుల్లెట్ స్పీడ్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడంపై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించింది. ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేసేందుకు మేఘా ఇంజనీరింగ్ సంస్థకు నిర్మాణ భాద్యతలు, అనుమతులు ఇవ్వడంతో పోలవరం పనులు యుద్ధప్రాతిపదికన ముందుకెళ్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టుపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించి తదుపరి చర్యలపై ఆదేశాలు కూడా జారిచేశారు. అలాగే కేంద్ర జల సంఘం ఆధీనంలోని ప్రాజెక్టు అథారిటీ కమిటి సభ్యులు నిర్మాణం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించించారు. మార్చి రెండో వారంలో హైదరాబాద్ లో ప్రాజెక్ట్‌ డిజైన్ల కమిటీ సమావేశమై పెండింగులో ఉన్న ఎనిమిది డిజైన్లకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఆనకట్ట మూడో గ్యాపులో మట్టికట్టతో కాకుండా కాంక్రిటుతో నిర్మాణం చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.

జూన్ 2021 టార్గెట్:
వచ్చే ఏడాది జూన్ లోపు పోలవరం ప్రాజెక్టును పూర్తి
చేయడం లక్యంగా గోదావరి నదిలో వరద ప్రవాహంలా పనులు ముందుకు సాగుతున్నాయి. మేఘా ఇంజనీరింగ్ సంస్థ
జనవరి 2020 నుంచి స్పిల్‌వే పనులు ముమ్మరం చేసింది. జనవరిలో 20631 ఘనపు మీటర్లు, ఫిబ్రవరిలో 32124 ఘ.మీ, మార్చిలో ఇప్పటివరకు 10063 ఘ.మీ పనులు పూర్తిచేసింది. ప్రాజెక్ట్‌ నిర్మాణంలో స్పిల్‌వే బీమ్‌ల నిర్మాణంతో పాటు వంతెనలు, డివైడ్‌ వాల్‌, ట్రైనింగ్‌ వాల్‌, గైడ్‌వాల్‌ నిర్మాణం పనులను వేగవంతం చేసింది. వీటితో పాటు
ఎర్త్‌ కమ్‌ ర్యాక్‌ ఫిల్‌ డ్యామ్, అందులోని మూడు గ్యాపులు, జల విద్యుత్‌ కేంద్రం మొదలైన ప్రధానమైన పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. రికార్డు స్థాయిలో పోలవరం నిర్మాణం పూర్తి చేయాలని మేఘా ఇంజనీరింగ్ 24/7 పనులు కొనసాగిస్తోంది.