పోలవరం నిర్మాణం, నాణ్యతపై DDRP అధికారులు ఫిదా

పోలవరం డిజైన్ కి DDRP పచ్చ జెండా, పోలవరం డిజైన్ & నాణ్యత పై DDRP పాండ్య ఫిదా.

పోలవరం:
పోలవరం పనులు మరియు నిర్మాణ ఆకృతులను పరిశీలించిన DDRP (Dam Designs Review Panel) చైర్మన్ AB పాండ్య పోలవరం నిర్మాణ పనులు మరియు నాణ్యత పై తన సంతృప్తి ని వ్యక్తం చేశారు.

మేఘా ఇంజనీరింగ్ సంస్థ రూపొందించిన పోలవరం ప్రాజెక్ట్ యెక్క 3D నిర్మాణ ఆకృతులను పుణె లోని సెంట్రల్ వాటర్ & పవర్ రీసెర్చ్ స్టేషన్ (CWPRS) వారు ఇంతకు ముందే పరిశీలించి పచ్చ జెండా ఊపారు.

మేఘా ఇంజనీరింగ్ కంపెనీ, పుణె లో ఉన్న CWPRS పరిశోధన సంస్థ కి సంబందించిన 1 ఎకరా స్థలం లో పోలవరం నమూనా ఆకృతి నీ రూపొందించి వివిధ ప్రయోగ పరీక్షల అనంతరం ఆ సంస్థ చే రూడీ చేయబడి మన్ననలు అందుకుంది.

DDR ప్యానల్ లో విషయ నిపుణులైన YK హండ, DP భార్గవ వంటి వారు ప్రాజెక్ట్ నిర్మాణ ఆకృతుల కు మరియు మలిదశ పనులకు చివరి ఆమోదo తెలుపడానికి సుముఖత వ్యక్తం చేశారు, చివరి ఆమోదo గూర్చి CWC కి త్వరలో లేఖ రాయ నున్నాం అని తెలిపారు.

ఈ సందర్భంగా, పోలవరం ప్రాజెక్టు యెక్క నిర్మాణ పనులు, నాణ్యత, భద్రత మరియు రైతాంగ శ్రేయస్సు దృష్ట్యా 2022 వరకు ప్రాజెక్ట్ నీ పూర్తి చేయాలని ఆశభావం వెలిబుచ్చారు.