పోలవరంలో రికార్డుల పరంపర-పూర్తయిన గడ్డర్ల అమరిక..

పోలవరం స్పిల్ వే లో మరో ప్రధాన అంకం పూర్తి అయింది.
ప్రాజెక్ట్ స్పిల్ వే కు పూర్తయిన గడ్డర్ల అమరికతో ప్రపంచంలోనే భారీ స్పిల్ వే నిర్మాణంతో అదే స్థాయిలో భారీ గడ్డర్ల వినియోగంలోకి రానున్నాయి.

అతి తక్కువ కాలం అంటే 60 రోజుల్లోనే 192 గడ్డర్లను మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఏర్పాటు చేసింది. నిరంతరం ఏపీ ముఖ్యమంత్రి, నీటి పారుదల శాఖ అధికారుల పర్యవేక్షణలో, స్పిల్ వే బ్రిడ్జి నిర్మాణంలో గడ్డర్లు కీలకంగా పూర్తి చేశారు.

స్పిల్ వే బ్రిడ్జి నిర్మాణానికి మొత్తం 192 గడ్డర్ల వినియోగం, స్పిల్ వే పై గడ్డర్లు, షట్టరింగ్ పనులతో స్లాబ్ నిర్మాణం, ఒక్కో గడ్డర్ సరాసరి 23 మీటర్లు పొడవు, 2 మీటర్లు ఎత్తు, ఒక గడ్డర్ తయారీకి 10 టన్నుల స్టీల్, 25 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వినియోగం, ఒక్కో గడ్డర్ బరువు 62 టన్నులు, దీనిని బట్టి ఎంత పెద్ద గడ్డర్లో అర్థం చేసుకోవచ్చు. స్పిల్ వే కి ఇంత భారీ పరిమాణం, గడ్డర్ల సంఖ్య వినియోగం చాలా అరుదుగా ఉంటుంది. మొత్తం గడ్డర్ల తయారీకి 1920 టన్నుల స్టీల్, 4800 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వినియోగంలోకి, పిబ్రవరి-17-2020 న గడ్డర్ల తయారీ మేఘా ఇంజనీరింగ్ నిర్మించగా, గడ్డర్లను పిల్లర్లపై పెట్టడానికి 200 టన్నుల రెండు భారీ క్రేన్ల వినియోగం, గడ్డర్లను స్పిల్ వే పిల్లర్ల జూలై-6-2020 అమర్చడం ప్రారంభం అయింది.

నీటి పారుదల శాఖ అధికారులు, మేఘా ఇంజనీరింగ్ పక్కా ప్రణాళికతో వరదలకు ముందే స్పిల్ వే పిల్లర్లపై గడ్డర్ల అమరిక
చేయగా, గోదావరికి భారీ వరదలు వచ్చినా పనులు ఆగకుండా స్పిల్ వే బ్రిడ్జి స్లాబ్ నిర్మాణం పూర్తయింది. 20, ఫిబ్రవరి- 2021 నాటికి స్పిల్ వే పిల్లర్లపై 192 గడ్డర్లు అమరిక పూర్తయ్యాయి.