మౌనం, మూగబోయిన, ఖాళీ రోడ్లు

మెట్రో నగరాల్లో నిర్మానుష రోడ్లు కల్లోనైనా చూస్తాం అనుకోలేదు? కారణం 130కోట్ల జనాభా నిత్యం 24/7 జనం సూర్యోదయం సూర్యాస్తమయం తేడా లేకుండా మిషన్ల జీవితాన్ని అనుభించడానికి అలవాటు పడిన బతుకులు. రోడ్లపై ఢిల్లీ to గల్లీ వరకు, నిత్యం కర్ఫ్యూ ఉండే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రోడ్లన్నీ వాహనాల రాకపోకలతో మార్మోగిపోయేవి. ఓ వైపు కాలుష్యం మరోవైవు ఉద్యోగ బాధ్యతలతో జీవితం నిత్యకృత్యంగా టెన్షన్ టెన్షన్ లైఫ్ మనకు అలవాటైంది. కానీ ఇప్పుడు హైదరాబాద్, ఢిల్లీ, ముంబాయి ఏ నగరమైన సరే ఖాళీ, నిర్మానుషం, ఏడారులను తలపించే రోడ్లు కారణం కరోనా వైరస్. ఈ వైరస్ మనకు మెన్ సమాజానికి జీవితంలో మరువలేని గుణపాఠాలు నేర్పుతోంది.

యావత్‌దేశానికి అనుసంధానకర్తగా ఉన్న సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ విశ్రాంతి, చార్మినార్ నిర్మానుష్యం, ట్యాంక్ బండ్ టిక్ టిక్ మనే శబ్దం మన వాచ్ లో వినబడేంత ప్రశాంతమైన వాతావరణం, ఢిల్లీ ఇండియా గేట్, కాశ్మీర్ శ్రీనగర్ ఎక్కడైనా
ఒక్కటే ఖాకీ రహదారులు. మెట్రో నగరాల్లో మనం వాహనాల్లో అనుకున్న ప్రదేశానికి అనుకున్న సమయానికి వెళ్లలేక సతమతమయ్యేమనకు రోడ్లు ఖాళీగా ఎలా ఉన్నాయో చూడండి.