బికినిలో పూజా హెగ్డే ముద్దుగుమ్మ

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రేసులో ముందు వినిపించే పేర్లలో పూజా హెగ్డే ఒకరు. ఈ అమ్మడు తెలుగుతో పాటు హిందీ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. పోయిన ఏడాది హౌస్ ఫుల్ 4 చిత్రంతో హిందీ ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల మరో హిందీ సినిమాలో అవకాశన్ని దక్కించుకుందట. హిందీలో పూజా నటించబోతున్న కొత్త సినిమాలో బికినీ వేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది.

గతంలో అల్లు అర్జున్ తో నటించిన ‘డీజే’ చిత్రంలో బికినీ వేసుకుంది. ఆ సినిమా సమయంలో పూజా హెగ్డేకు పెద్దగా క్రేజ్ లేదు. కనుక పారితోషికం తక్కువే తీసుకుంది. కాని ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ , బాలీవుడ్ లలో క్రేజీ హీరోయిన్ కనుక పారితోషికాన్ని పెంచేసినట్లు సమాచారం. సాదారణంగా రెండు కోట్ల వరకు పారితోషికం తీసుకునే పూజా హెగ్డే హిందీలో బికినీతో పాటు బెడ్ రూం సీన్స్ ల్లో నటించేందుకు ఏకంగా మూడు కోట్ల రూపాయలను డిమాండ్ చేసిందట.

హీరోయిన్ పాత్రకు ఉన్న ప్రాముఖ్యత ఉండటంతోపాటు గ్లామర్ సీన్లు బికినీ సీన్స్ ఎక్కువ సార్లు ఉండటం వల్ల ఆమె అడిగిన మొత్తంను ఇచ్చేందుకు నిర్మాతలు ఓకే చెప్పారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఆ చిత్రం లాక్ డౌన్ అనంతర పట్టాలెక్కే అవకాశం ఉంది.