సోషల్ మీడియా గ్రూపులో అసభ్య ఛాటింగ్ “పోలీస్ కొరడా”

దేశరాజధానిలో సంచలనం సృష్టించిన వివాదాస్పద ఇన్‌స్ట్రా గ్రూప్ వ్యవహారంలో ఓ విద్యార్థిని ఢిల్లీ సైబర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ విద్యార్థిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతని మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, ఈ ఇన్‌స్ట్రా గ్రూపును డీయాక్టివేట్ చేశారు. కాగా ఈ బాలుడు ఢిల్లీలోని ఓ ప్రముఖ పాఠశాలలో చదువుతున్నాడని తెలిసింది.

ఈ గ్రూప్ చాట్‌లో మొత్తం 20మంది పాల్గొన్నారని, మిగిలిన సభ్యుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఇన్‌స్ట్రా గ్రూపులో మొత్తం 100మంది సభ్యులున్నట్లు తేలింది. దీనిని గురించిన మరిన్ని వివరాల కోసం సైబర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దక్షిణ ఢిల్లీలోని 11, 12తరగతులకు చెందిన కొందరు విద్యార్థులు బాయిస్ లాకర్ రూమ్ అనే పేరుతో ఓ ఇన్‌స్ట్రా గ్రూపును ఏర్పాటు చేసుకున్నారు.

అనుమతి లేకుండా మైనర్ విద్యార్థినుల ఫోటోలను తమ గ్రూపులో షేర్ చేయడమే కాకుండా, వారిపై అసభ్యకరమైన వ్యాఖ్యలను కూడా చేశారు. ఈ గ్రూపు సభ్యులు చేసిన చాటింగ్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌లను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వ్యవహారంపై 19సంవత్సరాల కళాశాల విద్యార్థిని ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు.