అంగట్లో ఆక్సిజన్ తప్పదేమో

అంగట్లో ఆక్సిజన్ తప్పదేమో

శశి థరూర్ ట్విట్టర్ వేదికలో లక్షలాది ఫాలోయర్స్ పరిచయం అవసరం లేని పేరు. సతీమణి సునంద పుష్కర్ మరణంతో వార్తల్లో ప్రముఖంగా రాయబడ్డ వ్యక్తి. 65 ఏళ్ళ వయస్సులోను అందరిని ఆకర్షించే వ్యక్తి. మానవ వనరులు, విదేశీ వ్యవహారాల మంత్రిగా అలాగే UN అండర్ సెక్రటరీగా పని చేసిన శశి థరూర్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు.
ఇవాళ పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేకతను చాటారు. దేశ రాజధానిలో రోజు రోజుకు పెరిగిపోతోన్న కాలుష్యం నుంచి రక్షణ చర్యలు, జాగ్రత్తల్లో భాగంగా పోర్టబుల్ ఎయిర్ ఫూరిపైర్ మెడలో వేసుకుని రాజ్యసభ గేట్ నెంబర్ 12 నుంచి బయటకు వస్తుండగా మీడియా కంట బడ్డారు. రాబోయే రోజుల్లో మెడలో బంగారు అభరణాలు వేసుకున్నట్టు ఈ ఎయిర్ ఫూరిపైర్ వాడాల్సి వస్తుందేమో కర్మ కర్మ. రెండు దశాబ్దాలుగా తాగే నీరు కలుషితం అవడంతో డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇప్పుడు RO ఫూరిపైర్, కింలే, బిస్లరీ వాడుతున్నాం అలాగే పంచ భూతాల్లో ఒక్కటైన ప్రాణ వాయువు ఆక్సిజన్ ను కొని పీల్చే దుస్థితి తప్పదేమో…ఇప్పటికైనా మనం మేల్కోవాలి పర్యావరణాన్ని రక్షించాలి లేదంటే విపరీతలు, వింతలు, విడ్డురాలు తప్పవు మరీ.