విద్యుత్ సిబ్బంది విధులకు వందనం. MP సంతోష్

కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ప్రజలందరి శ్రేయస్సు కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న విద్యుత్ సిబ్బందికి రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ అభినందనలు తెలియజేశారు.

మన అందరం ఇంటికే పరిమితమైన ఈ సమయంలో అంతరాయం లేకుండా 24గంటల విద్యుత్ ను మనకు సరఫరా చేస్తున్నారు. ఓ వేల వీళ్లందరు విధులకు హాజరు కాకుండా ఉంటే మనకు ఇంటిలో విద్యుత్ లేకుండా ఉండే పరిస్థితి ఏమిటో ఒక్కసారి మనం అందరం ఆలోచన ఊహించాలి. అదేవిదంగా గ్రామీణ ప్రాంతాల్లో పంటలు చివరి దశలో ఉన్నాయి ఈ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోతే నీరు అందక పంటలు ఎండిపోయి రైతులకు ఊహించని రీతిలో నష్టం జరిగేది.

రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుండి విధులు నిర్వహిస్తున్న పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు విద్యుత్ కార్మికులను కూడ మనం అభినందనలు తెలియజేయాలి. ఇంత వేసవి కాలంలో కూడా ఒక్క సారి విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా అందిస్తున్నారు. ఈ కార్యచరణలో ముఖ్యమంత్రి కెసిఆర్ ముందు చూపుతో చేసిన ప్రణాళికల వల్లనే ఇది సాధ్యమైందని అభినందించారు.