హీరోగా ప్రభాస్ విలన్ అరవింద్ స్వామి కొత్త సినిమా?

ప్రభాస్ సినిమా కోసం ఆయన అభిమానులే కాదు యావత్ దేశంలోని సినిమా ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణతో సినిమా చేస్తున్న ప్రభాస్ ఆ సినిమా తర్వాత మహానటి దర్శకుడితో జట్టుకట్టబోతున్నాడు. భారీ బడ్జెట్ నిధులతో వైజయంతి మూవీస్ ఈ సినిమా నిర్మాణచనుంది. సోషియో ఫాంటసీ కధాంశంతో తెరేకెక్కే ఈ సినిమా కోసం ప్రభాస్ హీరోకి ధీటుగా తమిళ యాక్టర్ ఒకరిని అనుకుంటున్నట్లు సమాచారం.

హీరోయిజం ఎలివేట్ అవ్వాలంటే విలన్ స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి దాని కోసం ఒక ప్రముఖ నటుడిని సంప్రదిస్తున్నారట. అతనెవరో కాదు ధృవ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ పాత్రలో అడుగుపెట్టిన అరవింద్ స్వామి.

ప్రభాస్ పర్సనాలిటీకి అరవింద్ స్వామి అయితే కరెక్ట్ గా సెట్ అవుతాడని ఈ ప్రాజెక్ట్ లోకి విలన్ గా తీసుకురావాలని అశ్విన్ ఆలోచిస్తున్నాడట. లాక్ డౌన్ తరువాత వీటిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాగా సోసియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ సినిమా కావడంతో సహజంగానే విఎఫ్ఎక్స్ భారీగా ఉంటాయి. దాంతో అశ్వినీదత్ ఈ చిత్రం విఎఫ్ఎక్స్ కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించారట.

తాజా సమాచారం ప్రకారం నాగ్ అశ్విన్ ఈ సినిమాకి సంబంధించిన మొత్తం స్క్రిప్ట్ పూర్తి చేసాడట. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించాడట. అవి పూర్తైతే ఈ సినిమా ఈ ఏడాది చివరిలో డిసెంబర్ వరకు సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.