వలస కార్మికులను మిస్ అవుతున్న విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్

వలస కార్మికులకు అండగా నిలిచినందుకు ట్విట్టర్ లో కేటీఆర్ కి కృతజ్ఞతలు తెలిపిన ప్రకాష్ రాజ్. రీల్ లైఫ్ విలన్ ప్రకాష్ రాజ్ రియల్ లైఫ్ లో మాత్రం హీరో…తనదైన నటనతో ఎంతోమంది అభిమానులను స్వంతం చేసుకున్న ప్రకాష్ రాజ్,సామాజిక దృక్పథంతో తను చేస్తున్న సంఘసేవ తో మరెంతో మందికి స్ఫూర్తి గా నిలుస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని వారి అవసరాలను తీరుస్తున్న ప్రకాష్ రాజ్ తాజాగా లాక్ డౌన్ నేపథ్యంలో షెల్టర్ లేని వలస కార్మికులకు తన ఫామ్ హౌస్ లో ఆశ్రయం కల్పించారు.

44 రోజులపాటు వారికి అండగా ఉన్న ప్రకాష్ రాజ్ నేడు వారిని మిస్ అవుతున్నారు. అందుకు కారణం ప్రభుత్వం వారిని వారి స్వస్థలాలకు పంపించడమే. వారితో ఉన్నా అనుబంధాన్ని ట్విట్టర్ వేదికగా తెలంగాణ ఐటీ మంత్రి,టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ డిజిపిలను ప్రస్తావిస్తూ వలస కార్మికులతో తను గడిపిన క్షణాలను, వారితో పెనవేసుకున్న అనుబంధాలను తెలపడంతో పాటు వారిని వారి స్వస్థలాలకు పంపించినందుకు కృతజ్ఞత చెప్పారు.