శాసన మండలి పూర్వాపరాలు

1983లో రాష్ట్రంలో NTR నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టింది.90 మంది MLC లు ఉన్న శాసన మండలి లోకాంగ్రెస్ కు పూర్తి మెజారిటీ ఉంది .దీనివలన NTR అనుకున్న విధంగా అనేక బిల్లులకు శాసనమండలి ఆటంకంగా మారింది. దీంతో శాసనమండలిని రద్దు చేయాలంటూ 1984 మార్చిలో రామారావు శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు.

అయితే కేంద్రంలో ఇందిరా గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో శాసనమండలి రద్దు కాలేదు

అయితే తరువాత ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ హత్యకు గురికావడంతో 1984 అక్టోబర్ 31న రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు

మళ్ళీ ఏప్రిల్ 30 , 1985 లో మండలిని రద్దు చేయమని శాసన సభ లో తీర్మానం చేయించాడు ఎన్టీఆర్

రాష్ట్రాల్లో శాసనమండళ్లు ఆర్థిక భారమేనన్న భావనతో ఉన్న కారణంగా లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్‌శాసన మండలి రద్దు బిల్లును ప్రవేశపెట్టిన రాజీవ్ దాన్ని ఆమోదించారు. కాబట్టి మే 31 , 1985 న మండలి రద్దయింది

ఆ తరువాత 2004 మే నెలలో జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి బాధ్యతలు చేపట్టడంతో మరో మారు శాసనమండలి పునరుద్దరణకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

రాష్ట్రంలో శాసనమండలిని పునరుద్ధరించాలని కోరుతూ జూలై 8 2004 వ తేదీ శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. (శాసన మండలి వేస్ట్, ప్రజాధనం,సమయం వృధా తప్ప ఉపయోగం లేదు అని అప్పుడు చంద్రబాబు చెప్పాడు)

దీనిపై లోక్‌సభలో చర్చించాలని డిసెంబర్ 16 ,2004 న కేంద్రం అనుమతిచ్చింది. చివరకు డిసెంబర్ 15 ,2006 న లోక్‌సభ ఆమోదించడంతో రాష్టప్రతి భవన్‌కు వెళ్లింది. రాష్టప్రతి అనుమతించడంతో రాష్ట్రంలో జనవరి 10 ,2007 వ తేదీ YS CM గా ఉన్నప్పుడు శాసనమండలి పునరుద్ధరణకు నోచుకుంది.

ఉమ్మడి రాష్ట్రంలో 1985 నుంచి 2007 వరకు సుమారు 22 సంవత్సరాలు శాసనమండలి లేకుండా పరిపాలన కొనసాగింది.

(లోకేష్ యనమల లాంటి వారు ఈ రోజున MLC పదవులు మంత్రి పదవులు పొందారు అంటే YS పుణ్యమే)

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో శాసన మన్దలి లో 90 మంది MLC లు ఉంటె ఇప్పుడు విభజిత AP లో 58 మంది ఉన్నారు

టీడీపీ-34మంది MLC లు
వైసీపీ-9 మంది MLC లు
పిడిఎఫ్-6మంది MLC లు
బీజేపీ-2 MLC లు
ఇండిపెండెంట్-3 MLC

కాంగ్రెస్ 1
ఖాలీలు 3
మొత్తం 58

2021 కి కానీ వైసీపీ కి శాసన మండలి లో మెజారిటీ రాదు

దేశం లో ఉన్న 28 రాష్ట్రాల్లో 6 రాష్ట్రాల్లో (ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ,బీహార్ ఉత్తర ప్రదేశ్) లో శాసన మండలి ఉంది ( ఇటీవలే జమ్మూ కాశ్మీర్ లో రద్దయింది)

మండలి కోసం సంవత్సరానికి రూ.60 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 60 రోజులు సభ జరుగుతుందనుకుంటే రోజుకు రూ.కోటి ఖర్చు పెడుతున్నాం.

MLA లు శాసన సభ ద్వారా చేసే చట్టాలను మేధావులు అయిన పెద్దల సభ శాసన మండలి MLC అభ్యర్థులు సలహాలు సూచనలు ఇవ్వడానికి మాత్రమే ఉంది కానీ అడ్డుకొనే హక్కు లేదు
కానీ రాను రాను పార్టీల పునరావాసకేంద్రాలుగా మారిపోయింది శాసన మండలి

మండలి రద్దయితే …!!!
శాసన సభ లో చేసిన బిల్లులు శాసన మండలి కి పోకుండా గవర్నర్ ఆమోదం పొంది చట్ట రూపము దాల్చుతాయి

మండలి సెలెక్ట్ కమిటీకి పంపిన 3 రాజధానుల బిల్ రిపోర్ట్ ఇవ్వకముందే మండలి రద్దయితే శాసన సభ పంపిన బిల్ కు ఆమోదం లభించినట్టే

(ఏది ఏమైనా దొడ్డి దారిలో శాసన మండలి లో ఉన్న టీడీపీ MLC అయిన చైర్మన్ షరీఫ్ ను అడ్డం పెట్టుకొని నిబంధనలకు వ్యతిరేకంగా 3 రాజధానుల బిల్లును సెలక్ట్ కమిటీ కి పంపి 3 నెలలు ఆపడం ద్వారా బాబు బాపుకొనేదేముంది అని మేధావులు తటస్థులు టీడీపీ MLC లు చర్చించుకొంటున్నారు

శాసన మండలి రద్దయితే తమ భవిషత్తు ఏంటి అని టీడీపీ MLC లు బాబు పట్ల ఆగ్రహంగా ఉన్నారు, కొంతమంది వైసీపీ వైపు చూస్తున్నారు )