“లింగ నిర్ధారణ నేరమే”- ఫేక్ న్యూస్ వద్దు.

కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ గర్భధారణ సమయంలో లింగ నిర్థారణను తెలుపుటను నిషేధించిన పిసి & పిన్డిటి చట్టాన్ని నిలిపివేయలేదు

ప్రాసార మాధ్యమాల్లో ఓ వర్గం కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ గర్భంలోని శిశువు లింగ నిర్థారణ చేసే పద్దతుల నిషేధ చట్టం పిసి & పిన్డిటి చట్టం 1994ను నిలిపివేసిందని చేస్తున్న ప్రచారాన్ని ఖండించింది. లింగ నిర్థారణ నిషేధ చట్టాన్ని నిలిపివేయలేదని స్పష్టం చేసింది.

కొవిడ్ -19 వలన జరుగుతున్న లాక్డౌన్ దృష్ట్యా పిసి & ఎన్డిటి నిబంధనలు 1996లోని కొన్ని అంశాలను నిలిపివేసినట్లు 04 ఏప్రిల్ 2020న కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ ఒక ప్రకటన ఇచ్చింది. ఈ సమయంలో 5వ తేదీ నుండి సమర్పించే పరీక్ష నివేదకల, నమోదుల పునరుద్ధరణ మరియు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల త్రైమాసిక నివేదిక(క్యూపిఆర్)ల సమర్పణలకు సంబంధించి నిబంధనలను సంబంధించింది.

అల్ట్రాసౌండ్ క్లినిక్, జెనెటిక్ కౌన్సెలింగ్ కేంద్రాలు, జెనెటిక్ లాబొరేటరీ, జెనెటిక్ ఇమేజింగ్ కేంద్రాలు చట్ట ప్రకారం తప్పనిసరిగా నిర్వహించవలసిన రోజు వారీ రికార్డులను నిర్వహించాలని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ రికార్డులను సమర్పించడానికి గడవు తేదీని మాత్రమే జూన్ 30,2020 వరకు పొడిగించడమైనది. కానీ పిసి & పిన్డిటి చట్టంలోని నింబంధనల ప్రకారం పరీక్షా కేంద్రాలకు ఎటువంటి మినహాయింపు లేదు. నిబంధనల ప్రకారం నిర్వహించవలసిన అన్ని రికార్డులను తప్పనిసరిగా నిర్వహించవలసిందేనని ఈ ప్రకటన తెలిపింది. కఠినమైన పిసి & పిన్డిటి చట్టం మరియు నిబంధలు తప్పనిసరిగా అమలు జరుగతాయి.