అకాల వర్షాలు రైతన్నను ముంచాయి…

అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని AP సర్కారు హామీ ఇచ్చింది. రాష్ట్రంలో పంట నష్టంపై వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నష్టపోయిన పంట వివరాలను అధికారులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. పంట నష్టంపై ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ వాకబు చేశారని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.

AP సర్కారు రైతు ప్రభుత్వమని, తూర్పు‌ గోదావరి విషయానికి వస్తే నేలకొరిగిన పంట 9337 హెక్టార్లు, పనులు మీద ఉండి వర్షం పాలైన పంట 1378 హెక్టార్లు, కట్టలు కట్టి ఉండిపోయిన పంట 883 హెక్టార్లు, నూర్పుడి కల్లాల్లో ఉన్న ధాన్యం 7191హెక్టార్లని గణాంకాలు వెల్లడించారు.