మోఘల్ గార్డెన్ చూస్తే మంత్రముగ్దులు అవాల్సిందే!

మోఘల్ గార్డెన్ చూస్తే మంత్రముగ్దులు అవాల్సిందే!

రాష్ట్రపతి భవన్ లో మొఘల్ సామ్రాజ్య వైభవంకు చిహ్నం ఈ పూదోట. 15 ఎకరాల్లో విస్తరించిన మొఘల్ గార్డెన్ గులాబి, లిల్లీ, తులిప్ పుష్పాలు ఆకర్షణ. నెల రోజుల పాటు సందర్శకులకు అనుమతి ఉంటుంది. ప్రతి ఏడాదికోసారి మాత్రమే మొఘల్ గార్డెన్ సందర్శకులకు అనుమతిస్తారు.

రాష్ట్రపతి భవన్ గెట్ నెంబర్ 35 నుంచి మార్చి 8, 2020 వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు సందర్శకులను కనువిందు చేయనుంది.

రమణీయమైన పచ్చిక బయళ్ళు, ఉద్యాన వనాలు, అరుదైన పుష్పాలు, బోన్సాయి మొక్కలు, జంతువులు, సుగంధ ద్రవ్యాల మొక్కలు కట్టు దిట్టమైన భద్రత నడుమ సందర్శకులకు అనుమతి ఉంటుంది. ప్రతి సోమవారం మొఘల్ గార్డెన్ అనుమతి ఉండదు ఆ రోజు మాత్రం సెలవు.

నీలి రంగు నీటి కాలువలు, రెండు ఉద్యాన వనాలు ప్రత్యేకత. మధ్యన ఉండే ఉద్యాన వనం రెండు వైపులా 45 మీటర్ల పోడవు ఉండగా ఉద్యాన వనంలో ఆరు ఫౌంటెన్స్ ఉన్నాయి.

రాష్ట్రపతి భవన్ మొఘల్ గార్డెనులో ప్రత్యేకతలు మ్యూజికల్, ఆధ్యాత్మికం, హెర్బల్, బోన్సాయి, జీవ వైవిధ్యం తోటలు. మొఘల్ గార్డెన్ నిర్మాణశైలి చతురస్రాకారం గార్డెన్, పొడవైన గార్డెన్, వృత్తాకార గార్డెన్ శైలిలో ఉంటుంది.