బ్రెజిల్-భారత్ దేశంకు సలాం, సెల్యూట్, నమస్తే

COVID19 రోగులకు చికిత్స చేయడానికి హైడ్రాక్సీక్రోలోక్విన్‌ డ్రగ్ బ్రెజిల్‌ దేశానికి కూడా సరఫరా చేసి సహాయం చేసినందుకు బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ప్రసంగిస్తూ PM నరేంద్ర మోడీతో పాటు భారతీయులకు ధన్యవాదాలు తెలిపారు.

బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో రామాయణాన్ని గుర్తు చేస్తూ ‘హనుమంతుడు లక్ష్మణుడి ప్రాణ రక్షణకు హిమాలయాల నుంచి సంజీవని, జీసస్ బార్తీమీకి చూపు తెప్పించడంతో సహాయ సహకారాలు అందించారు. భారత్, బ్రెజిల్ దేశాలు అంతే స్నేహంగా ఐక్యమత్యంతో కలసికట్టుగా ఈ ప్రపంచ సంక్షోభాన్ని ఎదుర్కోవాలని హైడ్రాక్సీక్రోలోక్విన్‌ డ్రగ్ బ్రెజిల్ పౌరుల ప్రాణాలు కాపాడుకునేందుకు ఇవ్వాలని రెండుమూడు రోజుల కిందట రాసిన లేఖలో కోరారు.