భారతీయులకు PM మోడీ 7అభ్యర్థనలు

ప్రధానమంత్రి 7 సూత్రాలు

1. మీ ఇళ్లలోని పెద్దలు.. ప్రత్యేకించి దీర్ఘకాలిక వ్యాధులున్న వారిపట్ల అత్యంత జాగ్రత్త వహించండి. వాస్తవానికి అదనపు సంరక్షణతో వారు కరోనా వైరస్‌ బారినపడకుండా చూసుకోవాలి.

2 దిగ్బంధం ‘లక్షణరేఖ’కు కచ్చితంగా కట్టుబడండి.. సామాజిక దూరం తప్పక పాటించండి… ఇంట్లో తయారుచేసుకున్న మాస్కులు తప్పకుండా ధరించండి.

3. మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఆయుష్‌ మంత్రిత్వశాఖ జారీచేసిన మార్గదర్శకాలను అనుసరించండి. వేడినీళ్లు, కషాయం వంటిది తరచూ తాగుతూండండి.

4. కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధం కోసం ‘ఆరోగ్య సేతు’ మొబైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడంతోపాటు ఇతరులనూ అందుకు ప్రోత్సహించండి.

5. మీ చుట్టూ ఉన్న పేద కుటుంబాల యోగక్షేమాలను పట్టించుకోండి. ప్రత్యేకించి వారి అవసరాలు తీర్చడానికి ప్రయత్నించండి.

6. మీ వ్యాపారాలు, పరిశ్రమలలో పనిచేసేవారిపై కరుణతో మెలగండి. వారిలో ఎవరికీ జీవనోపాధి లేకుండా చేయవద్దు.

7. కరోనాపై పోరాడుతున్న డాక్టర్లు-నర్సులు, పోలీసు-పారిశుధ్య సిబ్బందివంటి మన జాతీయ యోధులపట్ల అత్యంత మన్నన చూపండి.

మిత్రులారా!
దిగ్బంధం నిబంధనలను మే 3వ తేదీదాకా అత్యంత చిత్తశుద్ధితో, శ్రద్ధతో పాటించండి.. దయచేసి ఎక్కడున్నారో అక్కడే ఉండండి… భద్రంగా ఉండండి.

“వయం రాష్టే జాగృత్యా”
‘మనమంతా ఒక్కటై ఈ జాతిని శాశ్వతంగా, చైతన్యంతో నిలుపుదాం’- ఈ పిలుపుతో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.

మీకందరికీ నా కృతజ్ఞతలు!