ఏప్రిల్5 సంకల్ప జ్యోతి, ఐక్యతే లక్ష్యం. PM మోడీ (తెలుగులో పూర్తి వివరాలు)

ఏప్రిల్5 భారతీయుల ఐక్యత చాటాలి. PM మోడీ

దేశ ప్రజలందరూ ఏప్రిల్5 ఆదివారం రాత్రి 9గంట‌ల‌కు 9నిమిషాలు మనమంతా ఒక్కటని, ఐక్యంగా కరోనా కట్టడికి పోరాడుతున్నామని నిరూపించాలి. అందుకు ఇంట్లో లైట్లు బంద్ చేసి అందరూ బాల్కనీలో నిలబడి 9నిమిషాల పాటు కొవ్వొత్తులు, దీపాలు, టార్చ్, మొబైల్ లైట్లు వెలిగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశవాసులకు పిలువు నిచ్చారు.

దేశ ప్ర‌జ‌ల‌కు పీఎం నరేంద్ర మోదీ వీడియోలో సందేశం తెలిపారు. భారతీయులు అంద‌రు క‌లిసి అత్యవసర స్థితిని ఎదుర్కొనేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. భారతీయులంతా ఎలాగైతే మార్చి22 ఆదివారం రోజు క‌రోనాకు వ్య‌తిరేకంగా పోరాటం చేస్తోన్న ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు తెలియజేయడమనే సంఘటన ఇతర దేశాల‌కు ఓ స్ఫూర్తిగా నిలిచింది. జ‌న‌తాక‌ర్ఫూ, చ‌ప్ప‌ట్లు కొట్టడమనేది ఓ స‌వాల్ ఇదే మన దేశ సామూహిక శ‌క్తి, ఐక్యతను నిరూపించింది. ఈ కరోనా మహామ్మారిని తరిమి కొట్టేందుకు దేశమంతా ఒక్క‌టిగా, ఐక్యంగా నిలిచి వ్య‌తిరేకంగా పోరాడుతోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లాక్‌డౌన్‌ కారణంగా అంద‌రు సవాళ్లను ఎదుర్కోవడం, సహాయ సహకారాలు అందించడం చారిత్రాత్మకం అవుతుంది. దేశంలోని కోట్లాది మంది భారతీయులు ఇళ్ల‌లోనే ఉండటంతో అంద‌రికి అనిపిస్తుంది ఒంటిరిగా ఏన్నాళ్ళు ఇలా? ఏం చేయాలి? ఈ కరోనా పోరాటాన్ని ఒంటరిగా ఎలా పోరాడాలనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. ఇంకా ఎన్ని రోజులు ఇలానే గ‌డ‌వాల‌ని ఆలోచ‌ను పక్కనబెట్టి లాక్ డౌన్ నిర్వహణలో మ‌నం ఒంట‌రి కాదు 130 కోట్ల సామూహిక శ‌క్తి మనలోని ప్ర‌తి ఒక్క‌రితో కలిసి ఉందనేది గుర్తుంచుకోవాలి. సామూహిక శ‌క్తి, భ‌వ్య‌త‌, విరాట‌త‌, దివ్య‌త అనుభూతి పొంద‌డం ఆవ‌స‌రం. మ‌న ద‌గ్గ‌ర ప్ర‌జ‌లు దేవ‌త‌ల రూపంలో ఉంటారు. మన దేశం యుద్దం చేస్తున్న స‌మ‌యంలో ప్ర‌తీసారి ప్ర‌జ‌లు మ‌హాశ‌క్తిని ధైర్య సాహాసాలను ప్ర‌ద‌ర్శిస్తుండాల్సిన అవసరం ఉంటుంది. అదే మనందరికీ మ‌నోబ‌లం, ధైర్యం ల‌క్ష్యంను నిర్ధేశిస్తుంది. మ‌న ముందున్న మార్గం క‌రోనా కొరల్లోని అంధ‌కారం మ‌ధ్య నుంచి నిరంత‌రం ప్ర‌కాశం వెదజల్లే లక్ష్యం వైపు వెళ్లాలి. క‌రోనా వైరస్ సంక‌టం నుంచి ఎక్కువగా మ‌న పేద‌ల్లో నిరాశ‌ నిస్పృహలు నింపుతోంది. సామాన్యులు అందరూ ఆ మహామ్మారి వైరస్ నుంచి భవిష్యత్ ఆశ‌ల వైపు అడుగులు వేయాలని కోరుతున్నాను. అనిశ్చితి, అంధ‌కారాన్ని స‌మాప్తం చేసి వెలుగుల వైపు అడుగులు వేయాలి భయాందోళనలు అవసరం లేదు.

మన దేశంలో క‌రోనాను ఓడించేందుకు గెలుపు వెలుగులను న‌లుదిశ‌లా విస్త‌రించాలి. భారతీయులు అందరూ ఏప్రిల్5 ఆదివారం మ‌నం అంద‌రం క‌లిసి క‌రోనా వైరస్ అంద‌కార పరిస్థితులను స‌వాల్ అనుకుని స్వీకరించాలి. మన మనస్సులోని వెలుగులతో దాగివున్న మ‌హాశ‌క్తిని జాగ‌రం చేయాలి. మ‌హా సంక‌ల్పం కొత్త ఎత్తుల‌కు తీసుకెళ్లాలి. ఏప్రిల్5 ఆదివారం అందరి సమయం రాత్రి 9గంట‌ల‌కు 9నిమిషాలు నాకు కావాలి. ఇంట్లో లైట్లు బంద్ చేసి బాల్కనీలో నిలబడి 9నిమిషాల పాటు కొవ్వొత్తులు, దీపాలు, టార్చ్, మొబైల్ లైట్లు వెలిగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశవాసులకు పిలువు నిచ్చారు. ఆ స‌మ‌యంలో ఇంట్లో అన్ని లైట్లు బంద్ చేయ‌డం ద్వారా దీపం వెలుగుల్లో దేశమంతా ఒకే ల‌క్ష్యంతో పోరాడుతున్నామ‌నే విష‌యం వెలుగు చూసేలా కలిసికట్టుగా ప్రజలందరూ ముందుకు రావాలి. ఈ వెలుగుల్లో మ‌నమంతా ఒంటరి మ‌న‌స్సులు కాదని ఐక్యంగా కలిసికట్టుగా ఉన్నామని నిరూపించాలి. దేశంలో ఎవరూ కూడా ఒంట‌రి కాదు మేమున్నాం 130 కోట్ల జ‌నం అందరూ ఒక్కటే, అందరి సంక‌ల్పం కూడా ఒక్కటేనని ప్రతిణ భూనాలి. మిత్రులారా మ‌రో విన్న‌పం ప్రజలు ఎవ‌రూ కూడా ఎక్క‌డా గుమి కూడ‌దు తప్పకుండా సామాజిక దూరం పాటించాలి. మీ ఇంట్లోనే లైట్లు బంద్ చేసినపుడు మీ ఇంటి తలుపు, బాల్క‌నీల‌పైనే నిలబడాలి. నా విన్నపం ఒక్కటే సామాజిక దూరమనే ల‌క్ష్మ‌ణ రేఖ‌ను ఉల్లంఘించ‌వ‌ద్దు. దేశంలో క‌రోనా వైరస్ మహామ్మారి ప్రాబల్యాన్ని తుంచే రామ‌బాణం ఇదొక్కటే. ఆదివారం ఏప్రిల్5 భారతీయులు అందరూ మ‌హాభార‌తం స్మ‌ర‌ణ చేయాలి. మనమంతా ఐక్య‌తతో ఉన్నామనే మనస్సులోనే మ‌హాశ‌క్తి అనుభూతి పొందాలి. మనకు గెలుపు ఆత్మ‌విశ్వాసాన్ని ఇస్తుంది. మ‌న ఉత్సాహం, మ‌న‌ స్ఫూర్తిని, మన మనోబలం మించిన మరో శ‌క్తి లేదు. అంద‌రం క‌లిసి ఐక్యమత్యంతో కరోనాపై పోరాడి ఇతరులకు సోకకుండా మన దేశం నుంచి పారద్రోలుదాం.

ఉత్సాహో బల్వాన్‌ ఆర్య, న అస్తి ఉత్సాహ్‌ పరం బలం! సహ్‌ ఉత్సాహస్య లోకేషు, న కించిత్‌ అపి దుర్లభం!” అంటే- “మన సంకల్పం, ఆత్మశక్తిని మించిన గొప్ప శక్తి లోకంలో మరేదీ లేదు. ఈ శక్తి తోడ్పాటు ఉన్నందువల్ల ప్రపంచంలో మనకు సాధ్యంకానిదేదీ లేదు.” అందుకే… రండి- మనమంతా సమష్టిగా ఈ కరోనా వైరస్‌ను పారదోలి, భరతమాతను విజయపథంలో నిలుపుదాం!