లాక్ డౌన్ మంగళవారం 10AM ప్రధాని ప్రకటన

రేపటితో ముగియనున్నా తొలి విడత 21 రోజుల దేశ వ్యాప్త లాక్ డౌన్, రెండో విడత కూడా ఉండబోతుందా? అంటే ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్, ఒరిస్సా ఏప్రిల్ 30 వరకు పొడగించాయి.

రెండో విడత లాక్ డౌన్ అంశంపై మంగళ వారం రోజు ఉదయం 10AMకు ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగం కూడా చేయబోతున్నారు. కోవిడ్-19 విజృంభణ నేపధ్యంలో చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్ కొనసాగింపు చేయాల్సిందేనన్నారు. అందుకే రెండో విడత దేశ వ్యాప్తంగా ఖచ్చితంగా లాక్ డౌన్ 15 రోజులు కొనసాగే అవకశాలున్నాయి.

కేంద్ర ప్రభుత్వం రెండో విడత లాక్ డౌన్ Red, Yellow, Green జోన్లుగా విభజించే యోచన చేస్తోంది. ఈ విషయంపై రాష్ట్రాలతో సంప్రదింపులు ఇప్పటికే జరుపుతున్నట్లు సమాచారం.

దేశంలో ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ మహామ్మారిని ధీటుగా ఎదుర్కోవడం కోసం ఈ జోనల్ వ్యవస్థ ఉపకరిస్తుందని కేంద్రం యోచిస్తోంది. మంగళవారం ఉదయం 10AM ప్రధాని నరేంద్ర మోదీ చేయబోతున్నా లాక్ డౌన్ ప్రకటనపై దేశవ్యాప్తంగా భారతీయులందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.