ప్రధాని ప్రసంగం పూర్తి వివరాలు. (తెలుగులో మీకోసం)

దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డికి మ‌రో 19 రోజులు లాక్‌డౌన్ అమ‌ల్లో ఉండ‌నుంది. మూడు వారాల లాక్ డౌన్ నేటి అర్ధ‌రాత్రితో ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో దేశ‌వ్యాప్త లాక్‌డౌన్‌ను “”మే 3వ”” తేదీ వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్టు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌క‌టించారు.

 

దేశంలో ఇప్పుడున్న హాట్‌స్పాట్ క్షేత్రాల్లో క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. కొత్త హాట్ స్పాట్ క్షేత్రాలు పెర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి అగ్నిప‌రీక్ష‌లో నెగ్గిన హాట్ స్పాట్ కేంద్రాల్లో ఏప్రిల్ 20 నుంచి అత్య‌వ‌స‌ర కార్య‌క‌లాపాల‌కు కొంత వెసులుబాటు అనుమ‌తి ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. ఆ స‌మ‌యంలో లాక్ డౌన్ నియ‌మాల‌ను ఉల్లంఘిస్తే అనుమ‌తులు వెన‌క్కి తీసుకోవ‌డం జ‌రుగుతంద‌ని స్ప‌ష్టం చేశారు. మూడు వారాల లాక్‌డౌన్ నేటి అర్ధ‌రాత్రి నుంచి ముగుస్తున్న నేప‌థ్యంలో ఇవాళ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ జాతినుద్ధేశించి ప్ర‌సంగించారు.

PM నరేంద్ర మోదీ ప్ర‌సంగంలోని ముఖ్యాంశాలు..

క‌రోనా వైర‌స్ పోరాటంలో భార‌త్ ప‌టిష్టంగా ముందుకు వెళుతోంది. దేశ ప్ర‌జ‌ల త‌ప‌స్సు, త్యాగాల ఫ‌లితంగా చాలా నష్టాన్ని త‌గ్గించుకోవ‌డంలో స‌ఫ‌లం అయ్యాం. క‌ష్టాన్ని ఓర్చుకుని దేశాన్ని కాపాడారు. అనేక క‌ష్టాలు వ‌చ్చాయి. ఆహారం, రాక‌పోక‌ల క‌ష్టాలు.. కుటుంభం నుంచి దూరంగా ఉన్నారు. దేశం కోసం క్ర‌మ‌శిక్ష‌ణ గ‌ల సైనికుడిలా క‌ర్త‌వ్యాన్ని నెర‌వేరుస్తున్నారు. మ‌న‌లో సామూహిక శ‌క్తి, సంక‌ల్పమే రాజ్యాంగ నిర్మాత BR అంబేద్క‌ర్ మాహానేతకు నిజ‌మైన నివాళి. అనేక రాష్ట్రాల్లో కొత్త సంవ‌త్స‌రం ప్రారంభం అయ్యింది.

లాక్‌డౌన్‌ నియ‌మాల‌ను పాటిస్తూ ఇళ్ల‌లోనే ఉండి పండుగులను నిరాడంబ‌రంగా జ‌రుపుకుంటున్నారు. స్ఫూర్తిదాయ‌కం, ప్ర‌శ‌సంనీయం. కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా అంద‌రూ సంపూర్ణ ఆరోగ్యం‌గా ఉండాల‌ని కోరుకుంటున్నాను. ప్ర‌పంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే.. కరోనా వైర‌స్ భార‌త్‌లో సంక్రమ‌ణ జ‌ర‌గ‌కుండా ఆప‌డానికి చేసిన ప్ర‌య‌త్నంలో దేశ ప్ర‌జ‌లు భాగ‌స్వాములుగా, సాక్షిగా ఉన్నారు. క‌రోనా ప్ర‌భావిత దేశాల నుంచి వ‌చ్చే వారిని ఎయిర్ పోర్టుల వ‌ద్ద స్క్రీన్ చేశాం. విదేశీ యాత్రికుల‌ను 14 రోజుల ఐస‌పోలేష‌న్ అనివార్యం చేశాము. సార్వ‌జ‌నీక ప్ర‌దేశాలు మూసి వేశాం. మ‌న‌దేశంలో 550 క‌రోనా కేసులు ఉన్న‌ప్పుడు 21 రోజుల లాక్ డౌన్ అమ‌లు చేశాం. స‌మ‌స్య పెరిగే వ‌ర‌కు వేచి చూడ‌లేదు. స‌మ‌స్య క‌నిపించిన వెంట‌నే, త్వ‌ర‌గా నిర్ణ‌యాలు తీసుకుని వైర‌స్ సంక్ర‌మ‌ణ ఆప‌డానికి పూర్తి స్థాయిలో ప్ర‌య‌త్నం చేశాం.

 

ప్ర‌పంచ‌ములో స‌మ‌ర్థ‌వంత‌మైన దేశాలతో పోలిస్తే మనం మన దేశం తేరుకున్న స్థితిలో ఉంది. క‌రోనా సంక్ర‌మ‌ణ విష‌యంలో నెల, నెల‌న్న‌ర ముందు అనేక దేశాలు భార‌త్‌తో స‌మానంగా ఉన్నాయి. ఇవాళ భార‌త్ తో పోలిస్తే ఆదేశాల్లో 25, 30% పెరిగింది. వేలాది మంది మృత్యువాత ప‌డ్డారు. హోలిస్టిక్ అప్రోచ్‌, ఇంటిగ్రేట‌డ్ అప్రోచ్ ఉండ‌క‌పోతే, స‌మ‌యానుసారంగా వేగంగా నిర్ణ‌యాలు తీసుకోక‌పోయి ఉంటే.. భార‌త్ ఏ స్థితిగతుల్లో ఉండేదో ఊహించ‌లేము. గ‌డిచి పోయిన రోజుల‌ అనుభ‌వాల‌ను గ‌మనిస్తే.. మ‌నం ఎంచుకున్న మార్గం అదే నిజ‌మ‌ని తేలింది.

సామాజిక దూరం, లాక్‌ డౌన్ కారణంగా మన దేశానికి లాభం చేకూరుతోంది. ఆర్ధిక దృష్టితి చూస్తే భారం అవుతుంది. మూల్యాన్ని చెల్లించుకున్నాం. దేశ ప్ర‌జ‌ల ప్రాణాల‌ ముందు అదేం ఎక్కువ కాదు. త‌క్కువ వ‌న‌రుల‌తో ‌మ‌న‌దేశం న‌డిచిన తీరు.. ప్ర‌పంచంలో చ‌ర్చ అవుతోంది. రాష్ట్ర ప్ర‌భుత్వాలు, స్థానిక సంస్థ‌లు బాధ్య‌తాయుతంగా ప‌నిచేశాయి. 24 గంట‌ల పాటు ప‌నిచేశారు, ప‌రిస్థితుల‌ను అదుపులోకి తెచ్చారు. వైర‌స్ విజృంభన తీరు వైద్య‌నిపుణుల‌ను, దేశాల‌ను ‌మ‌రింత‌ అప్ర‌మ‌త్తం చేసింది. క‌రోనా వైర‌స్‌పై ఎలా విజ‌యం సాధించాలి, న‌ష్టం వాటిల్ల కుండా ఎలా బయటపడాలి..ప్రజల కష్టాలు త‌గ్గించే విష‌యంలో రాష్ట్రాల‌తో చ‌ర్చలు జ‌రిపాము. లాక్‌డౌన్ పొడిగించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు, ప్ర‌జ‌లు కూడా సూచించారు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్‌ విధానంను పొడిగించాయి.

దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డికి లాక్‌డౌన్‌ను మే 3 వతేదీ వ‌ర‌కు పొడిగింపు ఉంటుంది. దేశ ప్ర‌జ‌లు‌ లాక్‌ డౌన్లోనే సురక్షితంగా ఉండాలి. కొత్త క్షేత్రాల్లో విస్త‌రించ‌కూడ‌దు. స్థానిక క్షేత్రాల్లో ఏ ఒక్క‌రు కరోనా బారిన పడి సంఖ్య పెరిగినా.. మ‌న‌కు ఆందోళ‌న‌క‌ర‌ విష‌యం అవుతుంది. వైర‌స్ వ‌ల్ల చ‌నిపోతే ఆందోళ‌న మ‌రింత పెర‌గుతుంది. హాట్‌స్పాట్ కేంద్రాల్లో ముందు చూపుతో చాలా అప్ర‌మ‌త్తంగా ఉండాలి. హాట్‌స్పాట్ కేంద్రాల్లో క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలి. కొత్త హాట్‌స్పాట్‌లు ఏర్పాటు మన కృషి, త‌ప‌స్సలకు స‌వాల్ విసురుతుంది. ప్రజలందరూ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలి. ఏప్రిల్‌ 20 వ‌ర‌కు
ప్ర‌తి ఊరు, వాడ‌, సూక్ష్మ ప‌రిశీల‌న ఉంటుంది. లాక్‌డౌన్ పాల‌న ఎంత వ‌ర‌కు ఉంటుంది? ఈ విషయంలో ఆయా క్షేత్రాల్లో క‌రోనా నుంచి ఎంత వ‌ర‌కు కాపాడుకోగలిగాం అనే మూల్యాంక‌నం చేయ‌డంపై ఆధారపడుతుంది.

అగ్నిప‌రీక్ష‌లో స‌ఫ‌లం అయిన క్షేత్రం..హాట్‌స్పాట్ కానీ ప్రాంతాల్లో 20 ఏప్రిల్ నుంచి ‌కొన్ని అత్య‌వ‌స‌ర కార్య‌క‌లాపాల‌కు అనుమ‌తి ఇవ్వడం జ‌రుగుతుంది. ఈ అనుమ‌తి ష‌ర‌తులతో కూడిన‌దిగా ఉంటుంది. బ‌య‌ట‌కు వెళ్లే విష‌యంలో క‌ఠినంగా ఉండాలి. లాక్‌డౌన్‌ నియ‌మాల‌ను ఉల్లంగించరాదు, నిర్ల‌క్ష్యం చేయ‌వ‌ద్దు. ఎవ్వ‌రినీ నిర్ల‌క్ష్యం చేయ‌నీయ‌ వద్దు. 20 ఏప్రిల్ నుంచి ప‌రిమిత వెసులుబాటు ప్ర‌తిపాద‌న‌కు సంబంధించి ప్ర‌భుత్వం నుంచి మార్గదర్శకాలు విడుద‌ల చేస్తాం‌. పేద‌ల జీవ‌న విధానాన్ని దృష్టిలో పెట్టుకుని వెసులుబాటు క‌ల్పిస్తాం.

నా తొలి ప్రాధాన్య‌త పేద‌ల‌ జీవితంలో వ‌చ్చిన క‌ష్టాలు త‌గ్గించ‌డం. పీఎం గ‌రీబ్‌క‌ళ్యాణ్ ప‌థ‌కం నుంచి వారికి స‌హాయం చేయ‌డానికి ప్ర‌య‌త్నం చేశాం. ర‌బీ, ఖ‌రీప్ ను దృష్టిల పెట్టుకుని రైతుల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కూడ‌దు. మందులు, రేష‌న్ అందుబాటులో ఉన్నాయి. వైద్య మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న విష‌యంలో ముందుకు వెళ్తున్నాం.220 ల్యాబ్ ల‌లో టెస్టులు జ‌రుగుతున్నాయి.

క‌రోనా 10వేల రోగులు ఉన్న‌ప్పుడు.. 1500, 1600 బెడ్‌ల‌ అవ‌స‌రం ఉంటుంది. కాని మ‌న ద‌గ్గ‌ర‌ ల‌క్ష‌కు పైగా పడకలు అందుబాటులో ఉన్నాయి. 600పైగా ఆసుప‌త్రులు కోవిడ్ కోసం ప‌నిచేస్తున్నాయి. వైద్య‌ స‌దుపాయాల‌ను వేగంగా పెంచ‌డం జ‌రుగుతుంది. ప‌రిమిత‌మైన వ‌న‌రులు ఉన్న‌ప్ప‌టికీ.. మాన‌వ క‌ళ్యాణం కోసం యువ శాస్త్ర‌వేత్త‌లు వ్యాక్సిన్ త‌యారు చేయ‌డానికి కృషి చేస్తున్నారు. ప్ర‌జ‌లు ధైర్యంగా నియమాల‌ను పాటించ‌డం వ‌ల్ల క‌రోనా మ‌హ‌మ్మారిని ఓడిస్తాం. స‌ప్త‌ప‌ది విజ‌యానికి మార్గం.

ప్రతి ఒక్కరు ఇంట్లో వృద్ధుల‌పై దృష్టిని సారించాలి. ముఖ్యంగా రోగులుగా ఉన్న వృద్ధుల ప‌ట్ల ప్ర‌త్యేక దృష్టి పెట్టాలి. లాక్ డౌన్‌, సామాజిక దూరం, ల‌క్ష్మ‌ణ‌రేఖ‌ పాటించాలి. ఇంట్లో త‌యారు చేసిన మాస్క్ ల‌ను త‌ప్ప‌నిస‌రిగా పెట్టుకుకోవాలి. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోడానికి ఆయుష్ మంత్రిత్వ‌శాఖ‌ ద్వారా చేసిన సూచ‌న‌లు పాటించాలి. క‌రోనా వైర‌స్ వ్యాప్తిని ఆప‌డానికి ఆరోగ్య‌సేతు మొబైల్‌ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్ డౌన్‌లోడ్‌కు ఇత‌రుల‌ను ప్రేరేపితం చేయాలి. సాధ్య‌మైనంత మేర‌కు పేద‌ల‌కు బాగోగులు చూడాలి. భోజ‌న అవ‌స‌రాలు తీర్చాలి. ఎవ్వ‌రిని కూడా ఉద్యోగాల నుంచి తొలిగించ‌వ‌ద్దు. డాక్ట‌ర్లు, న‌ర్సులు, పారిశుద్య‌, పోలీసు సిబ్బందిని గౌర‌వించాలి.. ఏడు మాట‌లు స‌ప్త‌ప‌ది విజ‌య‌ప్రాప్తికి మార్గం. 3 మే వ‌ర‌కు లాక్‌డౌన్ నియ‌మాల‌ను పాటించాలి. ఎక్క‌డ ఉన్న‌వారు అక్క‌డే ఉండి. సుర‌క్షితంగా ఉండాలి. దేశాన్ని జాగృతం చేయాలి‌.  శ్యామ్, సీనియర్ జర్నలిస్టు.