PM/CMs కాన్ఫరెన్స్ లాక్ డౌన్ తప్పదు/ఎన్ని రోజులు??

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముక్తకంఠంతో లాక్ డౌన్ ఏప్రిల్ నెలాఖరు వరకు పొడగించాలని ఈ కాన్ఫరెన్స్ లో అభిప్రాయబడ్డారు. PM మోదీ కూడా ముఖ్యమంత్రులతో లాక్ డౌన్ కొనసాగింపు తప్పదని తెలిపారని సమాచారం. కరోనా మహామ్మారి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా లాక్ డౌన్ అమలు చేయాలని వెల కట్టలేని ప్రజల ప్రాణాలను కాపాడే భాద్యత తమపై ఉందని ప్రజారోగ్యానికే పెద్దపీట వేయాలని సూచించారు. ఏప్రిల్ 30వరకు రెండో విడత లాక్ డౌన్ కొనసాగిస్తారా లేక ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ప్రధానమంత్రి లేదా PMO అధికారిక ప్రకటన చేయబోతున్నారు.

అంతేకాకుండా మౌళికవసతులు, వ్యవసాయం,రవాణా, అత్యవసరాలు, వైద్య సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా రక్ష చర్యలు చేపట్టాలని ఈ సమావేశంలో చర్చించారు.