విశాఖ ఘటనపై సీఎం YSJకు ప్రధాని ఫోన్

విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై ప్రధాని మోదీతో సీఎం YS జగన్ మాట్లాడారు. విశాఖలో గ్యాస్‌ లీక్‌ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి YS జగన్‌కు ఫోన్‌ చేసి దుర్ఘటన వివరాలను తెలుసుకున్నారు. AP ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న సహాయ చర్యలను CM జగన్ తెలియజేశారు. పరిస్థితి అదుపులోనే ఉందని, బాధితులకు వైద్య సహాయం అందిస్తున్నామని వెల్లడించారు. అలాగే రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ కూడా సీఎం జగన్మోహన్ ఫోన్‌ చేశారు. ప్రమాదానికి దారి తీసిన కారణాలు, చేపడుతోన్న సహాయక చర్యలను సీఎం ఆయనకు వివరించారు.