గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. PM మోదీ

గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు

గుడ్ ఫ్రైడే రోజున క్రీస్తును గుర్తుచేసుకుంటూ సత్యం, సేవ మరియు న్యాయం పట్ల యేసు క్రీస్తు నిబద్ధతను ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొనియాడారు.

“ప్రభువైన క్రీస్తు తన జీవితాన్ని ఇతరుల సేవ కోసం త్యాగం చేశారు. ఆయన ధైర్యం మరియు ధర్మంతో పాటు న్యాయ భావన తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయి. ఈ రోజు గుడ్ ఫ్రైడే రోజున మనం క్రీస్తు ప్రభువునూ, అలాగే సత్యం, సేవ మరియు న్యాయం పట్ల ఆయన నిబద్ధతనూ మనం గుర్తు చేసుకుందాం”, అని ప్రధానమంత్రి తమ సందేశంలో పేర్కొన్నారు.