USA మాటల్లో జయహో భారత్

భార‌త, అమెరికా భాగ‌స్వామ్యం మునుపెన్నడూ లేనంత బ‌లంగా ఉంద‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. కోవిడ్ -19పై అమెరికా జ‌రుపుతున్న పోరాటం కోసం USAకు హైడ్రాక్సిక్లోరోక్విన్ డ్రాగ్ స‌ర‌ఫ‌రా చేయాల‌ని భార‌త‌దేశం తీసుకున్న నిర్ణ‌యానికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంస్ చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ ఈ మాట‌ల‌న్నారు.

అమెరికా అధ్య‌క్షుడి ట్వీట్ విషయానికి స్పందిస్తూ ప్ర‌ధాన‌మంత్రి, “ఇలాంటి సమయాలు స్నేహితులను దగ్గర చేస్తాయి. భారత్-USA భాగస్వామ్యం గతంలో కంటే బలంగా ఉంది. మానవాళికి సహాయం చేయడానికి భారతదేశం సాధ్యమైనంత వరకు ప్రతిదీ చేస్తుంది” అని పేర్కొన్నారు.