లాక్ డౌన్ అంశంపై PM/CMs వీడియో కాన్ఫరెన్స్

21రోజులు మాత్రమే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ఉంటుందా? పొడగిస్తారా? ఎంతకాలం పొడిగిస్తారు? ఎందుకు పొడగించాలి? లేకపోతే వైరస్‌ ప్రభావం ఎక్కువ అవుతుందా?ఇప్పటికి నిర్వర్తించాల్సిన కర్తవ్యాలు ఏంటీ? రాష్ట్రాల్లో అసలు కరోనా కష్టాలు నిజాలు? ప్రజలకు నిత్యావసరాలు అందుబాటు? కరోనా వైద్య సేవలు అందుతున్నాయా? వైద్య పరికరాలు, కావాల్సిన అత్యవసరాలు ఉన్నాయా? రెడ్/గ్రీన్ జోన్లుగా ఏమైనా ప్రకటిస్తారా? లాక్ డౌన్ అన్ని ఏరియాల్లోనా? లేక పరిమితం కానుందా? వీటన్నింటితో పాటు భవిష్యత్ కార్యాచరణపై ప్రధానమంత్రి అలాగే రాష్ట్రాల ముఖ్యమంత్రుల వీడియో సమావేశం జరగబోతోంది. ప్రజలు మాత్రం లాక్ డౌన్ కొనసాగిస్తే సహకరిద్దాం ఈ మహామ్మారి మన దేశం నుంచి తరిమి కొడదాం అంటూ సిద్ధంగానే ఉన్నారు. కారణం రోజురోజుకు మన దేశంలో కరోనా కేసులు పెరగడం ఇప్పటికే 6వేలు సోకిన వ్యక్తులు, 100కు పైగా మృతుల సంఖ్య దాటేసింది. అందుకే ప్రజల్లో కరోనా వైరస్ మహామ్మారిపై అవగాహన అంతకంతకు పెరుగుతోంది.