సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు నాడే ప్రిన్స్ న్యూ మూవీ పోస్టర్

ఈ నెల 31వ తేదీన సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు. మహేశ్ బాబు తాజా చిత్రం టైటిల్ తో కూడిన ఫస్టు పోస్టర్ ను ఆ రోజున రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.మహేశ్ బాబు తన తదుపరి సినిమాను పరశురామ్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమా నుంచి మహేశ్ బాబు ఫస్టులుక్ ను వదలాలనే ఆలోచన చేసినట్టుగా తెలుస్తోంది. ఇక మరో రెండు కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఆ రోజున వెలువడనున్నట్టు చెబుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

అయితే ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు అన్ని రకాల పనులను పూర్తి చేసుకుని సెట్స్ పైకి వెళ్లడానికి చాలా సమయం పడుతుంది. ఈ లోగా మహేశ్ బాబు రెండు సినిమాలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఆ రెండు సినిమాలకి సంబంధించిన ప్రకటన మే 31వ తేదీన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. ఆ ఇద్దరు దర్శకులు ఎవరు? కథా నేపథ్యం ఏమిటి? మహేశ్ బాబు పాత్ర ఎలా వుండనుంది? అనేది ఆసక్తికరంగా మారింది. దాంతో కృష్ణ పుట్టినరోజు కోసం అభిమానులంతా కుతూహలంగా ఎదురుచూస్తున్నారు.