ప్రియాంకకు కలిసొచ్చిన కాలం

ప్రియాంకకు కలిసొచ్చిన కాలం

ప్రియాంక చతుర్వేది కాంగ్రెస్ అధిష్టానం తీరును త‌ప్పు ప‌డుతూ గతంలో పార్టీకి రాజీనామా చేసింది. అప్పట్లో
ప‌త్రిక‌ల్లో వ్యాసాలు రాస్తూ కాంగ్రెస్ పార్టీ అజెండాను మోశారు. ఆ తర్వాత లోక్ స‌భ సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముందే ఈమె శివ‌సేనలో చేరిపోయారు. అంతలోనే మ‌హారాష్ట్ర అసెంబ్లీ కోటాలో రాజ్య‌స‌భ స‌భ్యులుగా ఎన్నిక‌వుతున్న జాబితాలో ప్రియాంక చ‌తుర్వేది చేరిపోయారు. ప్రియాంక చతుర్వేది,
ఈమె వ‌య‌సు 40 సంవ‌త్స‌రాలే, పెద్ద‌ల స‌భకు అవ‌కాశం ద‌క్క‌డం గ‌మ‌నార్హం. కాంగ్రెస్ పార్టీలోనే ఉండుంటే అధికార ప్రతినిధిగానే ఉండేది కానీ ఇప్పుడేమో పార్లమెంట్ సభ్యురాలు హోదా సొంతం చేసుకుంది. శివ‌సేన‌లోకి చేర‌డం వెంటనే రాజ్య‌స‌భ‌కు నామినేట్ అవడం ప్రియాంకకు కలిసొచ్చిన కాలం.