రోజుకు లక్షకు పైగానే PPEలు MADE IN INDIA.

దేశంలో కోవిడ్-19 కేసులకు చికిత్స చేసే వైద్య సిబ్బందికి అవసరమైన ఆరోగ్య రక్షణ తొడుగుల (కవరాల్) ఉత్పత్తి సామర్థ్యం రోజుకు ఒక లక్షకు పైగా ఉంది. కోవిడ్-19 కేసులను ఎదుర్కోవటానికి దేశంలో పిపిఇ తొడుగుల ఉత్పత్తికి బెంగళూరు ప్రధాన కేంద్రంగా మారింది. దేశంలో తొడుగుల ఉత్పత్తిలో దాదాపు యాభై శాతం బెంగళూరు నుండే ఉత్పత్తి అవుతున్నాయి. శరీరం అంతటికి తొడుగులు (పిపిఇ) ఆరోగ్య నిపుణులకు అధిక స్థాయి రక్షణ కోసం ఉద్దేశించిన ప్రత్యేకమైన రక్షణాత్మక సూట్ కాబట్టి, దీనికి ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సూచించిన విధంగా కఠినమైన సాంకేతిక జాగ్రత్తలు అవసరం. మెస్సర్స్ హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ సంస్థని ఏక గవాక్ష సేకరణ ఏజెన్సీగా నియమించింది కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ.

బెంగళూరుతో పాటు, పిపిఇ తొడుగులను ‌ను తమిళనాడులోని తిరుపూర్, చెన్నై కోయంబత్తూర్, గుజరాత్‌లోని అహ్మదాబాద్, వడోదర, పంజాబ్‌లోని ఫాగ్వారా, లుధియానా, కుసుమ్నగర్, భివాండి, మహారాష్ట్ర, రాజాత్, దుంగర్‌పూర్, నోయిడా, గురుగ్రామ్, మరికొన్ని ప్రదేశాలలో కూడా తయారు చేస్తున్నారు. ఈ రోజు వరకు సంచిత ఉత్పత్తి సుమారు ఒక మిలియన్ తొడుగుల యూనిట్లు.

2020 జనవరి చివరి వారంలో, ఐఎస్ఓ 16003 లేదా దాని సమానమైన ప్రమాణాల ప్రకారం డబ్ల్యూహెచ్ఓ క్లాస్ -3 బహిర్గత వత్తిడి ప్రకారం తొడుగుల సాంకేతిక ప్రమాణం సూచించబడింది. ఇటువంటి పదార్థాలను కొన్ని అంతర్జాతీయ కంపెనీలు తయారు చేస్తున్నాయి, వారు నిల్వల కొరత, మూల దేశాల ఎగుమతుల నిషేధం కారణంగా సరఫరా చేయలేకపోయారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సేకరణ సంస్థ పరిమిత పరిమాణాన్ని మాత్రమే అందించింది.

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2020 మార్చి 2 న సాంకేతిక అవసరాన్ని ఖరారు చేసింది. దేశంలో ఆ పదార్థాల లభ్యత, కోవిడ్-19 కేసులను పరిష్కరించే ఆరోగ్య సంరక్షణ నిపుణుల సంప్రదించి వీటిని ఖరారు చేసారు. మార్చి 5 న హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ లక్షణాలు-వివరాలను ప్రచురించారు. సేకరణ ప్రక్రియలో పాల్గొనడానికి తగిన సామర్థ్యం ఉన్న తయారీదారులను ఆహ్వానించింది.

ప్రస్తుతానికి, దేశంలో సింథటిక్ బ్లడ్ పెనెట్రేషన్ రెసిస్టెన్స్ టెస్ట్ సౌకర్యాలు ఉన్న నాలుగు ప్రయోగశాలలు ఉన్నాయి. ఇవి కోవిడ్-19 కి అవసరమైన శరీర తొడుగుల (పిపిఇ) ధృవీకరణకు పరీక్షలు కూడా నిర్వహించే సౌకర్యం ఉంది. ఈ నాలుగు ల్యాబ్ లు – సౌత్ ఇండియా టెక్స్‌టైల్స్‌ రీసెర్చ్ అసోసియేషన్ (సిట్రా), కోయంబత్తూర్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (డిఆర్‌డిఇ), గ్వాలియర్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు కింద రెండు ప్రయోగశాలలు – హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ, అవడి అండ్ స్మాల్ ఆర్మ్స్ ఫ్యాక్టరీ, కాన్పూర్.

ఫాబ్రిక్, పిపిఇ తొడుగుల వస్త్రానికి సంబంధించి నిర్వహించే ప్రతి పరీక్ష కోసం, సంబంధిత తయారీదారులు నమూనాలను పంపుతారు, ప్రత్యేకమైన సర్టిఫికేషన్ కోడ్ (యూసిసి – కోవిడ్19) ఇస్తారు. ఈ కోడ్‌లో ఫాబ్రిక్ రకం, వస్త్ర రకం, దాని పరీక్ష తేదీ, పరీక్షా ప్రమాణం, ఇతర సంబంధిత వివరాలు ఉన్నాయి. ఆమోదించిన ప్రతి నమూనాకు జారీ చేసిన యుసిసి ఉత్పత్తికి సంబంధించిన ఏ యూజర్ అయినా ధృవీకరణ కోసం డిఆర్డిఓ, ఓఎఫ్బి, సిత్ర అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురిస్తారు. పరీక్షా విధానాన్ని మరింత క్రమబద్ధీకరించడానికి, పిపిఇ తొడుగుల నాణ్యత నిర్ధారించడానికి సంబంధిత ధృవీకరణను చూపాల్సి ఉంటుంది.

పిపిఇ కిట్లను ఆరోగ్య మంత్రిత్వ శాఖ, రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా పంపుతోంది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఫార్మాస్యూటికల్స్ విభాగం జౌళి మంత్రిత్వ శాఖ 24×7 ప్రాతిపదికన వివిధ పరిశ్రమ సంస్థలు, వాటాదారులు తయారీదారులతో నిరంతరం పనిచేస్తున్నాయి, సరఫరా గొలుసును క్రమబద్ధీకరించడానికి, అడ్డంకులను తొలగించడానికి, ఆరోగ్య సంరక్షణ నిపుణులకు అవసరమైన అన్ని పదార్థాల స్థిరమైన సరఫరాను నిర్వహించడానికి ఈ కృషి జరుగుతోంది.