తెలంగాణలో విద్యార్థులకు ప్రమోషన్

ఒకటో తరగతి నుంచి 9తరగతుల విద్యార్థులను తదుపరి తరగతికి ప్రమోట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. కరోనా కష్ట కాలంలో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో విద్యార్థుల్లో నెలకొన్న గందరగోళ పరిస్థితులు తొలగిపోయాయి.