సామాజిక సేవలో ముందుండాలి. రాచకొండ సీపీ మహేష్ భగవత్.

సామాజిక సేవలో ముందుండాలి. రాచకొండ సీపీ మహేష్ భగవత్.

సామాజిక సేవలో ముందుండాలని దానికోసం ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని రాచకొండ సీపీ అన్నారు. ఈరోజు రుషిత చిన్న పిల్లల హాస్పిటల్లో రాచకొండ కమిషనరేట్ లోని పెట్రోలింగ్ వాహనాలకు *ఫస్ట్ ఎయిడ్ కిట్స్ (80)* లను రాచకొండ సీపీ *మహేష్ భగవత్* చేతులమీదుగా సిబ్బంది కి అందజేయడం జరిగింది.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో పోలీసు సిబ్బంది గాయపడిన వ్యక్తికి ఎలా ప్రాథమిక వైద్యం అందించాలి అనే దానిపై అనునిత్యం శిక్షణ కల్పిస్తామని ఆయన అన్నారు. రోడ్డు ప్రమాదం భారిన పడి అనేక మంది విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని, రోజుకి సగటున 700 మంది రోడ్డు ప్రమాధ క్షతగాత్రులు అవుతున్నారని, ఈ ప్రమాదాల సంఖ్య ను తగ్గించడానికి అందరూ కలిసి కృషి చేయాలని, ఇలాంటి మెడికల్ కిట్స్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని సీపీ అన్నారు. ఈరోజు అందించిన మెడికల్ కిట్స్ నిర్వహణ బాధ్యత తీసుకుంటామని ట్రస్ట్ చైర్మన్ సతీష్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంటనే సంఘటన స్థలానికి మొదలు చేరుకునేది పోలీస్ పెట్రోలింగ్ వాహనాలే కాబట్టి, అలాంటి వాహనాలలో మెడికల్ కిట్స్ లను పెద్ద సంఖ్యలో రుషిత చారిటబుల్ ట్రస్ట్ వారు అందజేయడం చాల ఆనందదాయకంగా ఉన్నదని, మాటలలో కాకుండా చేతలలో సామాజిక సేవలో ముందుంతుందని ఆయన అన్నారు. ట్రస్ట్ చైర్మన్ సతీష్ మరియు సభ్యులను రాచకొండ సీపీ మహేష్ భగవత్ అభినందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాచకొండ ట్రాఫిక్ డీసీపీ దివ్య చరణ్ రావు, ఆడిషన్ డీసీపీ అంబేరుపేట శంకర్ నాయక్, ఏసీపీ పృథ్విదర్ రావు, ఆర్ఐలు నాగమల్లు, భాస్కర్ నాయక్, ట్రస్ట్ సభ్యులు ప్రసన్న, ప్రతీక్, పారామిత హాస్పిటల్ వైద్యులు డాక్టర్. ధన్ రాజ్, డాక్టర్. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.