ప్రేమనగర్ లో పూజా హెగ్డే

టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్న అందాల భామ పూజ హెగ్డే ఇప్పుడు స్టార్ హీరోయిన్ హోదాను ఎంజాయ్ చేస్తోంది. స్టార్ హీరోల సరసన నటిస్తూ వరుస విజయాలను అందుకుంటుంది. దీంతో కోలీవుడ్ లోనూ అడుగు పెట్టబోతోంది. ఇప్పటికే హిందీలోనూ అమ్మడు తన సత్తా చాటుతుంది. ఇటీవల ఈ ముద్దుగుమ్మ అక్షయ్ కుమార్ సరసన హౌస్ ఫుల్ 4లో నటించిన విషయం తెలిసిందే.

ఇక ఈ ముద్దు గుమ్మా పై గత కొద్దీ రోజులుగా ఓ వార్త తెగ చక్కర్లు కొడుతుంది. పూజ హెగ్డే తానా బాయ్ ప్రెండ్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నదనేది ఆ వార్త…పూజ హెగ్డే నిజంగానే బాలీవుడ్ హీరో వినోద్ మెహ్రా కొడుకు రోహాన్ మెహ్రాతో ప్రేమాయణంలో ఉందని అందరూ ఫిక్స్ అవుతుంటే పూజ మాత్రం అలాంటిదేమి లేదని చెప్పుకొచ్చింది.

నేను రోహన్ మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని.. తనతో కలిసి ఉన్నప్పుడు కొంతమంది ఫొటోస్ తీసి ఇలాంటి రూమర్స్ సృష్టించారు అంతేనని మా ఇరువురు మధ్యలో ఏమిలేదని కొట్టిపారేసింది.